యిర్మీయా 2:27
వారు నా వైపు నేరుగా చూడకుండా తమ వీపు తిప్పుకున్నారు. 1 అయినా ఆపద సమయంలో మాత్రం, “వచ్చి మమ్మల్ని రక్షించు” అని నన్ను వేడుకుంటారు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
2 Chronicles 29:6“మన పూర్వీకులు అవిధేయులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడచి ఆయన్ని విసర్జించి, ఆయన నివాస స్థలం వైపు నుంచి ముఖం తిప్పుకుని నిర్లక్ష్యం చేశారు.
Psalms 115:4వారి విగ్రహాలు వెండి బంగారువి. అవి మనుష్యుల చేతిపనులు. 1
Isaiah 44:9విగ్రహాన్ని చేసే వారంతా మిధ్య. వారిష్టపడే విగ్రహాలు వ్యర్ధం. వారి సాక్షులు గ్రహింపు లేనివారు. చూడలేరు. కాబట్టి వారు సిగ్గు పాలవుతారు. 1
Isaiah 46:6ప్రజలు విస్తారమైన బంగారం తెచ్చి పోస్తారు. వెండిని తెచ్చి బరువు తూస్తారు. 1 ఒక కంసాలిని జీతానికి పిలిచి అతనికి దాన్ని అప్పగిస్తారు. అతడు దాన్ని ఒక దేవుడుగా రూపొందిస్తాడు. వారు దానికి సాగిలపడి నమస్కారం చేస్తారు. 1
Jeremiah 10:8వారంతా బుద్ధి హీనులు, అవివేకులు. చెక్కిన బొమ్మలను పూజించడం వలన వారికి కలిగే జ్ఞానం సున్నా. 1
Jeremiah 22:23రాజువైన నువ్వు, లెబానోను అడవిలోని ఇంటిలో నివసిస్తున్న నువ్వు, దేవదారు వృక్షాల్లో గూడు కట్టుకున్నా, ప్రసవిస్తూ ఉన్న స్త్రీకి కలిగే వేదనల్లాటివి నీకు కలుగుతాయి. నువ్వెంత మూలుగుతావో! 1