Jeremiah 21:6
ఈ పట్టణంలోని మనుషులనూ పశువులనూ చంపేస్తాను. వాళ్ళు తీవ్రమైన అంటురోగంతో చస్తారు.” 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
5నేనే నా బలమైన చెయ్యి చాపి తీవ్రమైన కోపంతో, రౌద్రంతో, ఆగ్రహంతో మీమీద యుద్ధం చేస్తాను. 1
Cross References
Isaiah 6:11“ప్రభూ, ఎన్నాళ్ల వరకు?” అని నేనడిగాను. ఆయన ఇలా అన్నాడు. “నివాసులు లేక పట్టణాలు, మనుష్యులు లేక ఇళ్ళు శిథిలమైపోయే దాకా, దేశం బొత్తిగా బీడుగా మారే దాకా, 1
Jeremiah 7:20కాబట్టి ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, ఈ స్థలం మీదా, ఈ మనుషుల మీదా, జంతువుల మీదా, పొలాలమీదా, చెట్ల మీదా, పంటల మీదా నా కోపాన్ని, నా ఉగ్రతను కుమ్మరిస్తాను. అది ఎన్నటికీ ఆరదు, మండుతూనే ఉంటుంది.
Jeremiah 14:12వాళ్ళు ఉపవాసమున్నప్పటికీ నేను వారి మొర వినను. వాళ్ళు దహనబలులూ నైవేద్యాలూ అర్పించినా నేను వాటిని అంగీకరించను. కత్తితో, కరువుతో, అంటువ్యాధులతో వారిని నాశనం చేస్తాను.”
Jeremiah 20:4యెహోవా ఈ మాట చెబుతున్నాడు. “నీకూ నీ స్నేహితులందరికీ నిన్ను భయకారణంగా చేస్తాను. నీ కళ్ళముందే వాళ్ళు తమ శత్రువుల కత్తికి గురై కూలుతారు. యూదా వాళ్ళందరినీ బబులోను రాజు చేతికి అప్పగిస్తాను. అతడు వాళ్ళను బందీలుగా బబులోను తీసుకుపోతాడు. కత్తితో వాళ్ళను చంపేస్తాడు. 1
Jeremiah 33:12సేనల ప్రభువు అయిన యెహోవా ఇలా అంటున్నాడు “మనుషులు, జంతువులు లేక పాడైపోయిన ఈ పట్టణాలు, కాపరులు తమ గొర్రెలను మేపే ప్రాంతాలుగా, వాటిని విశ్రమింపజేసే ప్రదేశాలుగా ఉంటాయి.
Jeremiah 36:29యూదా రాజైన యెహోయాకీముకు నువ్వు ఈ మాట చెప్పాలి. “యెహోవా చెప్పేదేమంటే, నువ్వు పుస్తకపు చుట్టను కాల్చేశావు! ‘బబులోను రాజు కచ్చితంగా వచ్చి ఈ దేశాన్ని నాశనం చేసి, ఈ ప్రజలను, జంతువులను నాశనం చేస్తాడు’ అని నువ్వు ఇందులో ఎందుకు రాశావు? అని అడిగావు.”