Jeremiah 21:7
యెహోవా ఇలా చెబుతున్నాడు. “ఆ తరువాత యూదా దేశపు రాజు సిద్కియానూ అతని ఉద్యోగులనూ తెగులును, కత్తిని, కరువును తప్పించుకున్న మిగిలిన ప్రజలనూ బబులోను రాజు నెబుకద్నెజరు చేతికీ వారి ప్రాణాలను తీయాలని చూసేవాళ్ళ శత్రువుల చేతికీ అప్పగిస్తాను. అతడు వారి మీద కనికరం, జాలి ఏమీ చూపక వారిని కత్తితో చంపేస్తాడు.” 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
6ఈ పట్టణంలోని మనుషులనూ పశువులనూ చంపేస్తాను. వాళ్ళు తీవ్రమైన అంటురోగంతో చస్తారు.” 1
8ఈ ప్రజలతో ఇలా చెప్పు. “యెహోవా చెప్పేదేమిటంటే, జీవమార్గం, మరణ మార్గం, నేను మీ ఎదుట ఉంచుతున్నాను. 1
Cross References
2 Kings 25:5అయితే కల్దీయులు పట్టణం చుట్టూ ఉన్నారు. రాజు మైదానానికి వెళ్ళే మార్గంలో వెళ్లిపోయాడు. కల్దీయుల సైన్యం రాజును తరిమి, అతని సైన్యం అతనికి దూరంగా చెదరిపోయిన కారణంగా యెరికో మైదానంలో అతన్ని పట్టుకున్నారు.
2 Kings 25:18నెబూజరదాను ప్రధానయాజకుడు శెరాయానూ, రెండో యాజకుడు జెఫన్యానూ, ముగ్గురు ద్వార పాలకులనూ పట్టుకున్నాడు.
Isaiah 13:17చూడు, వాళ్ళ మీద దాడి చెయ్యడానికి నేను మాదీయులను రేపడానికి సిద్ధంగా ఉన్నాను. వాళ్ళు వెండిని పట్టించుకోరు. బంగారం కూడా వాళ్ళకు ఆనందం కలిగించదు. 1
Isaiah 47:6నా ప్రజల మీద కోపంతో నా స్వాస్థ్యాన్ని అపవిత్రపరచి వారిని నీ చేతికి అప్పగించాను. 1 కాని నువ్వు వారి మీద కనికరం చూపలేదు. వృద్ధుల మీద నీ బరువైన కాడిని మోపావు. 1
Jeremiah 14:12వాళ్ళు ఉపవాసమున్నప్పటికీ నేను వారి మొర వినను. వాళ్ళు దహనబలులూ నైవేద్యాలూ అర్పించినా నేను వాటిని అంగీకరించను. కత్తితో, కరువుతో, అంటువ్యాధులతో వారిని నాశనం చేస్తాను.”
Jeremiah 20:4యెహోవా ఈ మాట చెబుతున్నాడు. “నీకూ నీ స్నేహితులందరికీ నిన్ను భయకారణంగా చేస్తాను. నీ కళ్ళముందే వాళ్ళు తమ శత్రువుల కత్తికి గురై కూలుతారు. యూదా వాళ్ళందరినీ బబులోను రాజు చేతికి అప్పగిస్తాను. అతడు వాళ్ళను బందీలుగా బబులోను తీసుకుపోతాడు. కత్తితో వాళ్ళను చంపేస్తాడు. 1