The Bible Software
bible.software › యిర్మీయా › యిర్మీయా 28 › యిర్మీయా 28:11

యిర్మీయా 28:11

ప్రజలందరి ఎదుట హనన్యా ఇలా అన్నాడు. “యెహోవా ఇలా చెబుతున్నాడు, ‘రెండేళ్ళలో నేను బబులోను రాజు నెబుకద్నెజరు కాడిని రాజ్యాలన్నిటి మెడమీద నుంచి తొలగించి దానిని విరిచివేస్తాను.’” అప్పుడు యిర్మీయా ప్రవక్త తన దారిన వెళ్లిపోయాడు.

బైబిల్ (తెలుగు)

In The King James Version

And Hananiah spake in the presence of all the people, saying, Thus saith the LORD; Even so will I break the yoke of Nebuchadnezzar king of Babylon from the neck of all nations within the space of two full years. And the prophet Jeremiah went his way.

In Context

10అయితే హనన్యా ప్రవక్త, యిర్మీయా ప్రవక్త మెడ మీదనుంచి ఆ కాడిని తీసి దాన్ని విరిచేశాడు.

12హనన్యా, యిర్మీయా మెడ మీద ఉన్న కాడిని విరిచిన తరువాత యెహోవా దగ్గర నుంచి ఈ సందేశం యిర్మీయాకు వచ్చింది.

Read all of యిర్మీయా 28

Cross References

1 Kings 13:18అప్పుడు ఆ ముసలి ప్రవక్త అతనితో “నేను కూడా నీలాంటి ప్రవక్తనే. యెహోవా ఆజ్ఞ ప్రకారం ఒక దేవదూత ‘భోజనం చేయడానికి అతన్ని వెంటబెట్టుకుని తీసుకు రా’ అని నాతో చెప్పాడు” అన్నాడు. అలా అతడు ఆ దేవుని మనిషితో అబద్ధమాడాడు.

1 Kings 22:11కెనయనా కొడుకు సిద్కియా ఇనుప కొమ్ములు చేయించుకుని వచ్చి “యెహోవా చెప్పేదేమిటంటే వీటితో నీవు సిరియా వారిని పొడిచి నిర్మూలిస్తావు” అన్నాడు.

2 Chronicles 18:22నీ ప్రవక్తలైన వీరి నోటిలో యెహోవా అబద్ధాలాడే ఆత్మను ఉంచాడు. యెహోవా నీకు కీడు నిర్ణయించాడు.”

Jeremiah 14:14అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నాడు. “ప్రవక్తలు నా పేరున అబద్ధాలు ప్రకటిస్తున్నారు. నేను వాళ్ళను పంపలేదు. వాళ్ళకు ఎలాంటి ఆజ్ఞా ఇవ్వలేదు. వాళ్ళతో మాట్లాడలేదు. అయితే వాళ్ళ హృదయాల్లోనుంచి మోసపూరితమైన దర్శనాలూ పనికిమాలిన, మోసపు శకునాలూ వస్తున్నాయి. వీటినే వాళ్ళు మీకు ప్రవచిస్తున్నారు.

Jeremiah 27:2యెహోవా నాకు ఇలా చెప్పాడు “నువ్వు కాడి, బేడీలూ చేయించుకుని నీ మెడకు కట్టుకో.

Jeremiah 29:9వాళ్ళు నా పేరట అబద్ధ ప్రవచనాలు మీతో చెప్తారు. నేను వాళ్ళను పంపలేదు.’ ఇదే యెహోవా వాక్కు.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study యిర్మీయా 28:11

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← యిర్మీయా 28:10యిర్మీయా 28యిర్మీయా 28:12 →