యిర్మీయా 31:7
యెహోవా ఇలా అంటున్నాడు. “యాకోబునుబట్టి సంతోషంతో కేక పెట్టండి! రాజ్యాల్లో ప్రధానమైన జాతిని బట్టి ఉత్సాహధ్వని చెయ్యండి! స్తుతి వినిపించనివ్వండి. ‘యెహోవా ఇశ్రాయేలులో మిగిలిన తన ప్రజలను రక్షించాడు’ అని పలకండి. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Deuteronomy 32:43ఇతర రాజ్యాల ప్రజలారా, దేవుని ప్రజలతో ఆనందించండి. 1 వధకు గురి అయిన తన సేవకుల రక్తానికి ఆయన పగ తీరుస్తాడు. 1 తన విరోధులకు ప్రతీకారం చేస్తాడు. 1 తన దేశం కోసం, తన ప్రజల కోసం ప్రాయశ్చిత్తం చేస్తాడు.
Psalms 28:9నీ ప్రజలను రక్షించు. నీ వారసత్వాన్ని ఆశీర్వదించు. వాళ్లకు కాపరిగా ఉండి, శాశ్వతంగా వాళ్ళను ఎత్తుకుని నడిపించు.
Psalms 69:35దేవుడు సీయోనును రక్షిస్తాడు. ఆయన యూదా పట్టణాలను తిరిగి కట్టిస్తాడు. ప్రజలు అక్కడ నివాసం ఉంటారు. అది వారి సొంతం అవుతుంది. 1
Psalms 98:1యెహోవాకు కొత్త పాట పాడండి. ఆయన అద్భుతాలు చేశాడు. ఆయన కుడి చెయ్యి, ఆయన పవిత్ర హస్తం మనకు విజయం తెచ్చాయి. 1
Psalms 117:1యెహోవాను స్తుతించండి. జాతులారా, సర్వప్రజానీకమా, ఆయనను కొనియాడండి. 1
Psalms 138:4యెహోవా, భూమిపై ఉన్న రాజులంతా నీ నోటి వెంట వచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తారు. 1