యిర్మీయా 31:8
చూడు, ఉత్తరదేశంలో నుంచి నేను వాళ్ళను తీసుకురాబోతున్నాను. గుడ్డివాళ్ళను, కుంటివాళ్ళను, గర్భిణులను, ప్రసవించడానికి సిద్ధంగా ఉన్న స్త్రీలను భూమి సుదూర ప్రాంతాలనుంచి అందరినీ సమకూరుస్తాను. మహా సమూహమై వారిక్కడికి తిరిగి వస్తారు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Deuteronomy 30:4చెదిరిపోయిన మీలో ఎవరైనా భూమి దిగంతాల్లో ఉన్నప్పటికీ అక్కడ నుంచి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని సమకూర్చి అక్కడ నుంచి తీసుకు వస్తాడు.
Psalms 98:3ఆయన ఇశ్రాయేలు వంశం పట్ల తన నిబంధన విశ్వసనీయత, తన నమ్మకత్వం గుర్తు చేసుకున్నాడు. భూదిగంతాలు మన దేవుని విజయాన్ని చూస్తారు. 1
Isaiah 40:11ఒక గొర్రెల కాపరిలాగా ఆయన తన మందను మేపుతాడు. తన చేతులతో గొర్రెపిల్లలను ఎత్తి రొమ్మున ఆనించుకుని మోస్తాడు. 1 పాలిచ్చే గొర్రెలను ఆయన నెమ్మదిగా నడిపిస్తాడు. 1
Isaiah 43:6‘వారిని అప్పగించు’ అని ఉత్తరదిక్కుకు, ‘అడ్డగించ వద్దు’ అని దక్షిణదిక్కుకు ఆజ్ఞాపిస్తాను. 1 దూర ప్రాంతాల నుండి నా కుమారులను, భూమి అంచుల నుండి నా కుమార్తెలను తెప్పించు. 1
Isaiah 52:10అన్ని రాజ్యాల కళ్ళెదుటే యెహోవా తన పవిత్ర హస్తం బయలుపరచాడు. ప్రపంచమంతా మన దేవుని రక్షణ చూస్తారు. 1
Jeremiah 3:18ఆ రోజుల్లో యూదా వారూ ఇశ్రాయేలు వారూ కలిసి ఉత్తరదేశం నుండి నేను మీ పూర్వీకులకు వారసత్వంగా ఇచ్చిన దేశానికి తిరిగి వస్తారు. 1