యిర్మీయా 4:16
దూరదేశం నుండి ముట్టడి వేసేవారు వచ్చి “యూదా పట్టణాలను పట్టుకోబోతున్నాం” అని పెద్దపెద్ద కేకలు వేస్తున్నారని యెరూషలేముకు, ఇతర రాజ్యాలకు ప్రకటించండి.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Isaiah 34:1రాజ్యాలన్నీ నా దగ్గరికి వచ్చి నేను చెప్పేది వినండి, ప్రజలందరూ జాగ్రత్తగా ఆలకించండి. 1 భూమీ దాని సంపూర్ణతా, లోకం, దానిలో పుట్టినదంతా వినాలి. 1
Jeremiah 2:15కొదమ సింహాలు అతనిపై గర్జించాయి, అతనిపై పెద్దగా అరుస్తూ అతని దేశాన్ని భయకంపితం చేశాయి. అతని పట్టణాలు ప్రజలు నివసించలేనంతగా నాశనం అయ్యాయి. 1
Jeremiah 5:6అరణ్యం నుండి వచ్చిన సింహం వారిని చంపుతుంది. 1 అడవి తోడేలు వారిని నాశనం చేస్తుంది. చిరుతపులి వారి పట్టణాల దగ్గర కాచుకుని వాటిలోనుండి బయటకు వచ్చిన ప్రతివాణ్ణీ చీల్చివేస్తుంది. 1 ఎందుకంటే వారి అక్రమాలు మితిమీరిపోయాయి. వారు విశ్వాసఘాతకులయ్యారు. 1
Jeremiah 6:18అయితే “మేము వినం” అని వారంటున్నారు. కాబట్టి, అన్యజనులారా, వినండి. సాక్షులారా, వారికేం జరగబోతున్నదో చూడండి. 1
Jeremiah 6:22యెహోవా చెప్పేదేమంటే, ఉత్తర దిక్కునుండి ఒక జనాంగం వస్తూ ఉంది. 1 ఎక్కడో దూర ప్రాంతం నుండి ఒక మహా గొప్ప రాజ్యం బయలు దేరింది. 1
Jeremiah 16:6ఈ దేశంలో గొప్పవాళ్ళు, సామాన్యులు అందరూ చస్తారు. వాళ్ళను ఎవ్వరూ పాతిపెట్టరు. వాళ్ళ గురించి ఎవరూ ఏడవరు. తమను తాము గాయపరచుకోరు. తలవెంట్రుకలు కత్తిరించుకోరు. 1