Jeremiah 49:22
చూడండి డేగలా శత్రువు దాడి చేస్తాడు. అది దూసుకు వచ్చి బొస్రాను తన రెక్కలతో కప్పివేస్తుంది. 1 ఆ రోజున ఏదోము సైనికుల హృదయాలు ప్రసవించడానికి నొప్పులు పడుతున్న స్త్రీ హృదయంలా ఉంటాయి.” 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
21వాళ్ళు కూలినప్పుడు భూమి కంపించింది. దాని దుర్గతికి అది వేసే కేకలు ఎర్ర సముద్రం వరకూ వినిపించాయి. 1
Cross References
Deuteronomy 28:49దేవుడైన యెహోవా చాలా దూరంలో ఉన్న ఒక దేశం మీ మీదికి దండెత్తేలా చేస్తాడు. వారి భాష మీకు తెలియదు. గద్ద తన ఎర దగ్గరికి ఎగిరి వచ్చినట్టు వాళ్ళు వస్తారు.
Isaiah 13:8ప్రజలు భయభ్రాంతులౌతారు. పురిటినొప్పులు పడే స్త్రీలాగా వాళ్లకు వేదనలు, దుఃఖాలు కలుగుతాయి. ఒకరినొకరు విస్తుపోయి చూసుకుంటారు. వాళ్ళ ముఖాలు మండిపోతూ ఉంటాయి. 1
Isaiah 26:17బిడ్డని కనే సమయం దగ్గర పడినప్పుడు గర్భవతి వేదనతో కేకలు పెట్టినట్టుగానే ప్రభూ, మేం కూడా నీ సన్నిధిలో వేదన పడ్డాం. 1
Jeremiah 4:31స్త్రీ పురిటినొప్పులతో కేకలు వేస్తున్నట్టు, తొలి కాన్పులో స్త్రీ కేకలు వేస్తున్నట్టు సీయోను కన్య “అయ్యో, నాకు బాధ! నా హంతకుల చేతిలో చిక్కి నేను మూర్చబోతున్నాను” అని ఎగశ్వాసతో చేతులు చాస్తూ వేస్తున్న కేకలు నాకు వినబడుతున్నాయి.
Jeremiah 13:21వారిని నీకై నువ్వు స్నేహితులుగా చేసికొన్నావు. ఇప్పుడు వారినే ఆయన నీ మీద అధిపతులుగా నియమిస్తే నీవేం చేస్తావు? 1 ప్రసవించే స్త్రీ పడే వేదన నీకు కలుగుతుంది కదా? 1
Jeremiah 30:6ప్రసూతి వేదనతో ఒక పురుషుడు బిడ్డను కనగలడా? మీరు అడిగి తెలుసుకోండి. ప్రతి యువకుడు తన నడుము మీద చేతులెందుకు పెట్టుకుంటున్నాడు? ప్రసవ వేదన పడే స్త్రీలా వాళ్ళ ముఖాలు ఎందుకు పాలిపోయాయి? 1