Jeremiah 49:5
చూడు. నీ పైకి తీవ్రమైన భయం తీసుకు వస్తున్నాను.” సేనల ప్రభువు అయిన యెహోవా చేస్తున్న ప్రకటన ఇది. 1 “నీ చుట్టూ ఉన్న ప్రజలనుండి నీకు ఆ భయం వస్తుంది. దాని ఎదుట నువ్వు చెదరిపోతావు. 1 పారిపోతున్న వాళ్ళను పోగు చేయడానికి ఎవరూ ఉండరు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Joshua 2:9“యెహోవా ఈ దేశాన్ని మీకిస్తున్నాడనీ, మీవల్ల మాకు భయం కల్గుతుందనీ నాకు తెలుసు. మీ భయం వల్ల ఈ దేశ నివాసులందరూ హడలి పోతారు.
2 Kings 19:7అతనిలో ఒక ఆత్మను నేను పుట్టిస్తాను. అతడు అ వదంతి విని తన దేశానికి వెళ్ళిపోతాడు. అతని దేశంలో అతన్ని కత్తితో చంపుతారు” అన్నాడు.
Proverbs 28:1ఎవరూ తరుమకుండానే దుష్టుడు పారిపోతాడు. నీతిమంతులు సింహం లాగా ధైర్యంగా ఉంటారు.
Jeremiah 6:25బయట పొలంలోకి వెళ్ళవద్దు. రహదారుల్లో నడవవద్దు. మా చుట్టూ కదులుతున్న శత్రువుల కత్తులు చూసి అంతటా భయం ఆవరించింది. 1
Jeremiah 20:4యెహోవా ఈ మాట చెబుతున్నాడు. “నీకూ నీ స్నేహితులందరికీ నిన్ను భయకారణంగా చేస్తాను. నీ కళ్ళముందే వాళ్ళు తమ శత్రువుల కత్తికి గురై కూలుతారు. యూదా వాళ్ళందరినీ బబులోను రాజు చేతికి అప్పగిస్తాను. అతడు వాళ్ళను బందీలుగా బబులోను తీసుకుపోతాడు. కత్తితో వాళ్ళను చంపేస్తాడు. 1
Jeremiah 48:41కోటలు పడగొడుతున్నారు. బలమైన దుర్గాలు పట్టుకుంటున్నారు. 1 ఆ రోజున మోయాబు వీరుల హృదయాలు ప్రసవించబోయే స్త్రీ హృదయంలా ఉంటాయి. 1