యిర్మీయా 51:24
బబులోనూ, కల్దీయ దేశనివాసులూ సీయోనుకి చేసిన దుర్మార్గానికంతటికీ 1 మీరు చూస్తుండగానే వాళ్లకి ప్రతీకారం చేస్తాను.” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Psalms 137:8నాశనం అయ్యేందుకు సిద్ధంగా ఉన్న బబులోను కుమారీ, నువ్వు మా పట్ల జరిగించిన దుష్ట క్రియలను బట్టి నీకు ప్రతీకారం చేయబోయేవాడు ధన్యుడు. 1
Isaiah 51:22నీ యెహోవా ప్రభువు తన ప్రజల పక్షాన వాదించే నీ దేవుడు ఇలా చెబుతున్నాడు, 1 “ఇదిగో, నువ్వు తూలేలా చేసే పాత్రను నా కోపంతో నిండిన ఆ పాత్రను నీ చేతిలోనుంచి తీసివేశాను. నీవది మళ్ళీ తాగవు. 1
Isaiah 63:1ఎర్రటి బట్టలు కట్టుకుని ఎదోములోని బొస్రా నుంచి వస్తున్న ఈయనెవరు? 1 రాజ వస్త్రాలతో తన మహా బలంతో గంభీరంగా వస్తున్న ఈయనెవరు? 1 నీతితో మాట్లాడే నేనే. రక్షించడానికి సమర్ధుణ్ణి. 1
Jeremiah 50:15దాని చుట్టూ నిలిచి జయజయ ధ్వానాలు చేయండి. ఆమె తన అధికారాన్ని వదులుకుంది. ఆమె గోపురాలు కూలిపోయాయి. 1 దాని గోడలు పడిపోతున్నాయి. యెహోవా ప్రతీకారం తీర్చుకుంటున్నాడు. 1 అది ఇతర దేశాలకు చేసినట్టే మీరు దానికి చేయండి. 1
Jeremiah 50:28వినండి. బబులోనులో నుండి తప్పించుకుని పారిపోతున్న వాళ్ళ శబ్దం వినిపిస్తుంది. 1 సీయోను విషయంలోనూ, తన మందిరం విషయంలోనూ మన దేవుడైన యెహోవా చేస్తున్న ప్రతీకారాన్ని ప్రకటించండి. 1
Jeremiah 51:11బాణాలు పదును పెట్టండి. డాళ్ళు చేత పట్టుకోండి. 1 బబులోనును నాశనం చేయడానికి యెహోవా మాదీయుల రాజు మనస్సును రేపుతున్నాడు. 1 అది యెహోవా తీర్చుకుంటున్న ప్రతీకారం. తన మందిరాన్ని కూలగొట్టినందుకు ఆయన చేస్తున్న ప్రతిదండన. 1