Job 10:6
నేను ఎలాంటి నేరం చేయలేదనీ, నీ చేతిలోనుండి నన్ను ఎవ్వరూ విడిపించలేరనీ నీకు తెలుసు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
That thou enquirest after mine iniquity, and searchest after my sin?
In Context
5నీ జీవితకాలం మనుషుల జీవితకాలం వంటిదా? నీ సంవత్సరాలు మనుషుల ఆయుష్షు వంటివా? 1
7అయినప్పటికీ నా నేరాలను గూర్చి ఎందుకు విచారణ చేస్తున్నావు? నాలో పాపాలు ఎందుకు వెతుకుతున్నావు? 1
Cross References
Job 10:14ఒకవేళ నేనేదైనా పాపం చేస్తే నీకు తెలిసిపోతుంది. నాకు శిక్ష విధించాలని నన్ను గమనిస్తూ ఉంటావు. 1
Job 14:16అయితే ఇప్పుడు నేను వేసే అడుగులు నువ్వు లెక్కిస్తున్నావు. నేను చేసే పాపాలు నీకు కోపం తెప్పిస్తున్నాయి. 1
Job 33:13నీవెందుకు ఆయనతో పోరాడతావు? తన క్రియల్లో దేన్ని గురించీ ఆయన సంజాయిషీ చెప్పుకోడు. 1
Psalms 44:21హృదయ రహస్యాలు తెలిసిన దేవుడు ఇది తెలుసుకోకుండా ఉంటాడా? 1
Zephaniah 1:12ఆ రోజుల్లో నేను దీపాలు చేబూని యెరూషలేమును గాలిస్తాను. పేరుకుపోయిన మడ్డి మీద నిలిచిన ద్రాక్షారసం లాంటివారై “యెహోవా మేలుగానీ కీడుగానీ చేసేవాడు కాడు” అని మనస్సులో అనుకొనే వారిని శిక్షిస్తాను.
1 Corinthians 4:5కాబట్టి ఆ కాలం రాకముందే, అంటే ప్రభువు వచ్చేంత వరకూ, దేనిని గూర్చీ తీర్పు తీర్చవద్దు. ఆయన చీకటిలో ఉన్న రహస్యాలను వెలుగులోకి తెచ్చి మనుషుల అంతరంగంలో ఉన్న ఉద్దేశ్యాలను బట్టబయలు చేస్తాడు. అప్పుడు ప్రతి ఒక్కరికీ తగిన ప్రశంస దేవుని నుండి కలుగుతుంది.