Job 19:2
మీరు నన్ను ఇలా ఎంతకాలం బాధపెడతారు? ఎంతకాలం మాటలతో నన్ను నలగగొడతారు? 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
How long will ye vex my soul, and break me in pieces with words?
In Context
1అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు, 1
3పదిసార్లు మీరు నన్ను నిందించారు. సిగ్గు లేకుండా నన్ను బాధిస్తూ ఉన్నారు. 1
Cross References
Judges 16:16ఇక ఆమె ప్రతిరోజూ తన మాటలతో అతణ్ణి విసికించడం ప్రారంభించింది. దాంతో అతనికి విసుగు పుట్టి “చావే నయం” అనిపించింది.
Job 18:2ఎంతసేపు మాటలు వెదుక్కుంటూ నన్ను చిక్కుల్లో పడేయాలని చూస్తావు? నువ్వు ఆలోచించుకో. తరువాత నేను మాట్లాడతాను. 1
Job 27:12మీలో ప్రతివాడూ దాన్ని చూశాడు. మీరెందుకు కేవలం వ్యర్థమైన వాటిని తలపోస్తూ ఉంటారు? 1
Psalms 13:1యెహోవా, ఎంతకాలం నన్ను మరచిపోతూ ఉంటావు? ఎంతకాలం ముఖం దాచుకుంటావు? 1
Psalms 55:21అతని నోటి మాటలు వెన్నలాగా మృదువుగా ఉన్నాయి. కాని అతని హృదయం నిండా కలహం ఉంది. అతని మాటలు నూనె కంటే నునుపుగా ఉంటాయి గానీ అవి నిజానికి దూసుకు వస్తున్న కత్తులు. 1
Psalms 64:3ఒకడు కత్తికి పదునుపెట్టేలా వారు తమ నాలుకలకు పదును పెడతారు. చేదు మాటలు అనే బాణాలను వారు ఎక్కుపెట్టారు. 1