Job 21:25
మరొకడు ఎన్నడూ సుఖ సంతోషాలు అనేవి తెలియకుండా మనోవేదన గలవాడై చనిపోతాడు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
And another dieth in the bitterness of his soul, and never eateth with pleasure.
In Context
24అతడి కుండ నిండా పాలు పొర్లుతాయి. అతడి ఎముకలు సత్తువ కలిగి ఉంటాయి. 1
26ఇద్దరినీ సమానంగా ఒకే వరసలో మట్టిలో పాతిపెడతారు. ఇద్దరినీ పురుగులు కప్పివేస్తాయి. 1
Cross References
2 Samuel 17:8నీ తండ్రి, అతనితో ఉన్నవారు మహా బలమైన యుద్ధ వీరులు. అడవిలో తమ పిల్లలను పోగొట్టుకొన్న ఎలుగుబంటులను పోలినవారై రగిలిపోతూ ఉన్నారని నీకు తెలుసు. నీ తండ్రి యుద్ధవిద్యలో నేర్పరి. అదీకాక అతడు తన మనుషులతో కలసి బసచేయడు.
Job 3:20దుర్దశలో ఉన్నవారికి వెలుగు ఎందుకు? దుఃఖాక్రాంతులైన వారికి జీవం ఎందుకు? 1
Job 9:18ఆయన నన్ను ఊపిరి పీల్చుకోనివ్వడు. చేదు పదార్థాలు నాకు తినిపిస్తాడు. 1
Job 20:23వాళ్ళు తమ కడుపు నింపుకునే సమయంలో దేవుడు వాళ్ళ మీద తన కోపాగ్ని కురిపిస్తాడు. వాళ్ళు తినే సమయంలోనే అది కురుస్తుంది. 1
Ecclesiastes 6:2అదేంటంటే, దేవుడు ఒకడికి ధనధాన్య సమృద్ధిని, ఘనతను అనుగ్రహిస్తాడు. అతడేం కోరినా అది కొరత లేకుండా ఇస్తాడు. అయితే దాన్ని అనుభవించే శక్తి మాత్రం దేవుడు అతనికి ఇవ్వడు. వేరే వ్యక్తి దాన్ని అనుభవిస్తాడు. ఇది నిష్ప్రయోజనంగా, గొప్ప అన్యాయంగా కనిపిస్తున్నది.
Ezekiel 4:16ఇంకా ఆయన నాకు ఇలా చెప్పాడు. “నరపుత్రుడా, చూడు, నేను యెరూషలేములో రొట్టె అనే ఆధారం లేకుండా చేస్తున్నాను. వాళ్ళు ఆందోళనతో ఒక పరిమితి ప్రకారం రొట్టెలు తింటారు. నీళ్ళు కూడా కొలత ప్రకారం భయంతో తాగుతారు.