Joel 2:12
యెహోవా ఇలా అంటున్నాడు, 1 “ఇప్పుడైనా, ఉపవాసముండి కన్నీళ్ళు కారుస్తూ దుఃఖిస్తూ 1 హృదయపూర్వకంగా నాదగ్గరికి తిరిగి రండి.” 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Deuteronomy 4:29అయితే అక్కడ నుండి మీ దేవుడు యెహోవాను మీ పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో వెతికితే, ఆయన మీకు ప్రత్యక్షమౌతాడు.
Judges 20:26చనిపోయిన వాళ్ళంతా కత్తియుద్ధం చేసేవాళ్ళే. అప్పుడు ఇశ్రాయేలీయుల సైనికులూ, ప్రజలూ అంతా వెళ్ళి బేతేలులో ప్రవేశించారు. అక్కడే ఏడుస్తూ సాయంకాలం వరకూ యెహోవా సమక్షంలో కూర్చుని ఉపవాసముండి, దేవునికి దహన బలులనూ సమాధాన బలులనూ అర్పించారు.
1 Samuel 7:6వారు మిస్పాలో సమావేశమై నీళ్లు చేది యెహోవా సన్నిధిలో కుమ్మరించి ఆ రోజంతా ఉపవాసం ఉండి “యెహోవా దృష్టిలో మేమంతా పాపం చేశాం” అని ఒప్పుకున్నారు. సమూయేలు మిస్పాలో ఉంటూ ఇశ్రాయేలీయులకు తీర్పు తీరుస్తూ న్యాయం జరిగిస్తున్నాడు.
1 Kings 8:47వారు చెరగా వెళ్ళిన దేశంలో తాము చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకుని, ‘మేము దుర్మార్గంగా ప్రవర్తించి పాపం చేశాము’ అని చింతించి, పశ్చాత్తాపపడి నీకు విన్నపం చేస్తే,
2 Chronicles 6:38తాము చెరలో ఉన్న దేశంలో తమ పూర్ణహృదయంతో పూర్ణాత్మతో నీవైపు తిరిగి, తమ పూర్వీకులకు నీవిచ్చిన తమ దేశం వైపూ నువ్వు కోరుకున్న ఈ పట్టణం వైపూ నీ నామఘనత కోసం నేను కట్టించిన ఈ మందిరం వైపూ మనస్సు తిప్పి వేడుకుంటే
2 Chronicles 20:3అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా దగ్గర విచారించడానికి మనస్సు పెట్టి, యూదా అంతటా ఉపవాసం ఆచరించాలని చాటించాడు.