John 20:17
యేసు ఆమెతో, “నేను ఇంకా తండ్రి దగ్గరికి ఎక్కి పోలేదు. కాబట్టి నన్ను తాకవద్దు. కానీ నా సోదరుల దగ్గరికి వెళ్ళి నా తండ్రీ, మీ తండ్రీ, నా దేవుడూ, మీ దేవుడూ అయిన ఆయన దగ్గరికి ఆరోహణం అవుతున్నానని వారికి చెప్పు” అన్నాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
2 Kings 4:29అప్పుడు ఎలీషా గేహజీతో “నీవు ప్రయాణానికి సిద్ధపడు. నా కర్ర చేత్తో పట్టుకో. ఆమె ఇంటికి వెళ్ళు. దారిలో నీకెవరైనా ఎదురైతే వాళ్ళను పలకరించ వద్దు. ఎవరైనా నిన్ను పలకరిస్తే వాళ్ళకు జవాబివ్వవద్దు. అక్కడికి వెళ్ళి నా కర్ర పిల్లవాడి ముఖంపై పెట్టు” అని చెప్పాడు.
Psalms 22:22నీ నామం నా సోదరులకు ప్రచారం చేస్తాను. సమాజం మధ్య నిన్ను స్తుతిస్తాను. 1
Psalms 48:14ఈ దేవుడు నిరంతరం మనకు దేవుడుగా ఉన్నాడు. మరణం వరకూ ఆయన మనలను నడిపిస్తాడు.
Psalms 89:26నువ్వు నా తండ్రివి, నా దేవుడివి, నా రక్షణ దుర్గం అని అతడు నన్ను పిలుస్తాడు. 1
Jeremiah 31:33“కానీ, ఈ రోజుల తరువాత నేను ఇశ్రాయేలు వాళ్ళతో, యూదా వాళ్ళతో స్థిరం చేసే ఒప్పందం ఇదే, వాళ్ళల్లో నా ధర్మశాస్త్రం ఉంచుతాను. వాళ్ళ హృదయం మీద దాన్ని రాస్తాను. నేను వాళ్లకు దేవుడుగా ఉంటాను, వాళ్ళు నాకు ప్రజలుగా ఉంటారు,” ఇది యెహోవా వాక్కు. 1
Ezekiel 36:28నేను మీ పితరులకిచ్చిన దేశంలో మీరు నివసిస్తారు. మీరు నా ప్రజగా ఉంటారు. నేను మీ దేవుడుగా ఉంటాను.