Joshua 2:24
వారు “ఆ దేశమంతా యెహోవా మన చేతికి కచ్చితంగా ఇచ్చేశాడు. మన గురించిన భయంతో ఆ దేశనివాసులందరికీ ధైర్యం చెడింది” అని యెహోషువతో చెప్పారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Exodus 15:15ఎదోము అధిపతులు భయపడతారు. మోయాబులో బలిష్ఠులు వణికిపోతారు. కనానులో నివసించే వారు భయంతో నీరసించి పోతారు, 1
Numbers 13:32ఈ విధంగా వారు తాము వెళ్లి చూసి వచ్చిన ప్రాంతం గురించి ఇశ్రాయేలు ప్రజలకు నిరుత్సాహ పరిచే నివేదిక ఇచ్చారు. “మేము చూసి వచ్చిన ఆ దేశం తన నివాసుల్నే మింగివేసే దేశం. మేము చూసిన ప్రజలంతా ఆజానుబాహులు.
Joshua 2:9“యెహోవా ఈ దేశాన్ని మీకిస్తున్నాడనీ, మీవల్ల మాకు భయం కల్గుతుందనీ నాకు తెలుసు. మీ భయం వల్ల ఈ దేశ నివాసులందరూ హడలి పోతారు.
Joshua 5:1వారు యొర్దానును దాటినంతసేపూ యెహోవా ఇశ్రాయేలీయుల ముందు ఉండి ఆ నదిలో నీళ్లను ఆరిపోయేలా చేసిన సంగతి యొర్దానుకు పశ్చిమాన ఉన్న అమోరీయుల రాజులూ, మహాసముద్రం తీరాన ఉన్న కనానీయుల రాజులూ విన్నప్పుడు, వారి గుండెలు అదిరిపోయాయి. ఇశ్రాయేలీయుల భయంతో వారు అధైర్యపడ్డారు. 1 గిల్గాలు దాటడం, సున్నతి పొందడం
Joshua 8:1కాబట్టి యెహోవా యెహోషువతో ఇలా అన్నాడు. “భయపడకు, జడియకు, యుద్ధసన్నద్ధులైన వారినందరినీ తీసుకుని హాయి మీదికి వెళ్ళు. చూడూ, నేను హాయి రాజునూ, అతని ప్రజలనూ, అతని పట్టణాన్నీ, అతని దేశాన్నీ నీ చేతికప్పగించాను.
Judges 1:2యెహోవా “ఆ దేశాన్ని యూదాజాతి వారికి ఇచ్చాను, వాళ్ళే ముందు వెళ్ళాలి” అని చెప్పాడు.