యెహో 8:1
కాబట్టి యెహోవా యెహోషువతో ఇలా అన్నాడు. “భయపడకు, జడియకు, యుద్ధసన్నద్ధులైన వారినందరినీ తీసుకుని హాయి మీదికి వెళ్ళు. చూడూ, నేను హాయి రాజునూ, అతని ప్రజలనూ, అతని పట్టణాన్నీ, అతని దేశాన్నీ నీ చేతికప్పగించాను.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Deuteronomy 7:18మీ యెహోవా దేవుడు ఫరోకీ ఐగుప్తు దేశానికి చేసిన దాన్ని, అంటే ఆయన మిమ్మల్ని బయటికి తెచ్చినప్పుడు
Deuteronomy 31:8నీకు ముందుగా వెళ్ళేవాడు యెహోవాయే. ఆయన నీతో ఉంటాడు. ఆయన నిన్ను వదిలిపెట్టడు, మర్చిపోడు. భయపడవద్దు. వాళ్ళను చూసి దిగులు పడవద్దు” అని ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట అతనితో చెప్పాడు. 1 దేవుని ధర్మ శాస్త్రం చదవడం
Joshua 2:24వారు “ఆ దేశమంతా యెహోవా మన చేతికి కచ్చితంగా ఇచ్చేశాడు. మన గురించిన భయంతో ఆ దేశనివాసులందరికీ ధైర్యం చెడింది” అని యెహోషువతో చెప్పారు.
Joshua 7:6యెహోషువ తన బట్టలు చింపుకున్నాడు. అతడూ ఇశ్రాయేలీయుల పెద్దలూ సాయంకాలం వరకూ యెహోవా మందసం ముందు నేలమీద ముఖాలు మోపి తలల మీద దుమ్మెత్తి పోసుకొంటూ
Joshua 10:7వెంటనే యెహోషువ, అతని దగ్గరున్న యోధులూ, పరాక్రమవంతులైన శూరులూ అందరూ గిల్గాలు నుండి బయలుదేరారు.
Psalms 44:3వాళ్ళు తమ చేతనున్న కత్తితో అక్కడి భూమిని తమ కోసం స్వాధీనం చేసుకోలేదు. వారి భుజబలం వారిని రక్షించలేదు. కానీ నీ కుడి చెయ్యి, నీ భుజబలం, నీ ముఖకాంతి వాళ్ళకి విజయం సాధించిపెట్టాయి. నువ్వు వాళ్ళకు అనుకూలంగా ఉన్నావు. 1