యెహో 22:25
మీకు మాకు మధ్య యెహోవా యొర్దాను నదిని సరిహద్దుగా చేశాడు. రూబేనీయులారా, గాదీయులారా, మీకు యెహోవాతో సంబంధం లేదు’ అంటారేమో అని భయపడి మేమిలా చేశాం. మీ పిల్లలు మా పిల్లలను యెహోవాను సేవించకుండా చేస్తారేమో.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
24రాబోయే కాలంలో మీ పిల్లలు మా పిల్లలతో, ‘ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాతో మీకేమి సంబంధం?
26కాబట్టి మేము, ‘మనం బలిపీఠం కట్టుకుందాం. అది దహనబలులకూ మరి ఎలాటి బలులకూ కాదు.
Cross References
1 Samuel 26:19రాజా, నా యజమానీ, దాసుడనైన నా మాటలు విను. నా మీద పగ సాధించాలని యెహోవా నిన్ను ప్రేరేపిస్తే ఆయన అర్పణ స్వీకరించి ఆయన్ను శాంతిపరచవచ్చు. మనుషులెవరైనా నిన్ను ప్రేరేపించినట్టైతే వారు తప్పక యెహోవా దృష్టిలో శాపానికి గురి అవుతారు. ఎందుకంటే వారు, ‘నువ్వు దేశం విడిచిపెట్టి ఇతర దేవుళ్ళను పూజించు’ అని నాకు చెప్పి, యెహోవా సన్నిధానం నుండి నన్ను దూరం చేస్తున్నారు.
1 Kings 12:16కాబట్టి ఇశ్రాయేలు వారంతా రాజు తమ విన్నపం వినలేదని తెలుసుకుని రాజుకిలా బదులిచ్చారు: 1 “దావీదు వంశంతో మాకేం సంబంధం? 1 యెష్షయి కొడుకుతో మాకు వారసత్వం ఏముంది? 1 ఇశ్రాయేలు ప్రజలారా, మీ మీ గుడారాలకు వెళ్ళండి. 1 దావీదు వంశమా, నీ వంశం సంగతి నువ్వే చూసుకో.” ఇలా చెప్పి ఇశ్రాయేలువారు తమ గుడారాలకు వెళ్లిపోయారు.
1 Kings 14:16తానే పాపం చేసి ఇశ్రాయేలువారు పాపం చేయడానికి కారణమైన యరొబాము పాపాలను బట్టి ఆయన ఇశ్రాయేలు వారిని శిక్షించబోతున్నాడు.”
Ezra 4:2వారు జెరుబ్బాబెలును, పూర్వికుల వంశాల పెద్దలను కలుసుకుని “మీరు సేవించే దేవుణ్ణి మేము కూడా సేవిస్తున్నాం. ఇక్కడికి మమ్మల్ని రప్పించిన అష్షూరు రాజు ఏసర్హద్దోను కాలం నుండి మేము యెహోవాకు బలులు అర్పిస్తున్నాము. మేము కూడా మీతో కలిసి ఆలయం కడతాం” అని చెప్పారు.
Psalms 16:5యెహోవా, నాకు వారసత్వంగా వచ్చిన వాటా నువ్వే. నువ్వే నా గిన్నె. నా అంతిమ గమ్యం నీ చేతుల్లోనే ఉంది. 1