Joshua 7:5
హాయి ప్రజలు వారిలో ముప్ఫై ఆరుగురిని చంపేశారు. అదీ కాకుండా వారి పట్టణ ద్వారం దగ్గర నుండి షేబారీము + 7:5 షేబారీము రాళ్ళు క్వారీ వరకూ తరిమి మోరాదులో వారిని చంపేశారు. కాబట్టి ఇశ్రాయేలీయుల గుండెలు కరిగి నీరైపోయాయి.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Deuteronomy 1:44అప్పుడు అక్కడ ఉన్న అమోరీయులు మీకెదురు వచ్చి, కందిరీగల్లాగా మిమ్మల్ని హోర్మా వరకూ తరిమి శేయీరులో మిమ్మల్ని హతం చేశారు.
Joshua 2:11వినగానే మా గుండెలు కరిగిపోయాయి. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశంలో, కింద భూమి మీదా దేవుడే. మీ ముందు ఎలాంటి మనుషులకైనా ధైర్యం ఏమాత్రం ఉండదు.
Psalms 22:14నన్ను నీళ్ళలా పారబోస్తున్నారు. నా ఎముకలన్నీ స్థానం తప్పాయి. 1 నా హృదయం మైనంలా ఉంది. నా అంతర్భాగాల్లో అది కరిగిపోతూ ఉంది. 1
Ezekiel 21:7అప్పుడు ‘నువ్వు ఎందుకు మూలుగుతున్నావు?’ అని వారు అడుగుతారు. అప్పుడు నువ్వు వాళ్ళతో, ‘కష్టదినం వచ్చేస్తోందనే దుర్వార్త నాకు వినిపించింది. అందరి గుండెలూ కరిగిపోతాయి. అందరి చేతులూ బలహీనం అవుతాయి. అందరి మనస్సులూ సొమ్మసిల్లిపోతాయి, అందరి మోకాళ్లు నీరుగారిపోతాయి. ఇంతగా కీడు వస్తూ ఉంది. అది వచ్చేసింది’ అని చెప్పు. ఇదే యెహోవా వాక్కు.”