Judges 13:5
నువ్వు గర్భవతివి అవుతావు. ఒక కొడుకుని కంటావు. ఆ పిల్లవాడు పుట్టినప్పట్నించి నాజీర్ + 13:5 నాజీర్ సంఖ్య. 6 చూడండి గా ఉంటాడు. అతని తలపై జుట్టును క్షౌరం చేయడానికై మంగలి కత్తి అతని తలను తాక కూడదు. అతడు ఇశ్రాయేలీ ప్రజలను ఫిలిష్తీయుల చేతి నుండి రక్షిస్తాడు.”
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
4ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ద్రాక్షా రసాన్ని గానీ మద్యాన్ని గానీ తాగకు. అపవిత్రమైనదేదీ తినకు.
Cross References
Numbers 6:2“ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడి ఇలా చెప్పు. ఎవరన్నా స్త్రీ గానీ పురుషుడు గానీ తనను యెహోవా కోసం ప్రత్యేకపరచుకుని + 6:2 యెహోవా పని కోసం ప్రత్యేకించబడిన.నాజీరు కావడానికి మొక్కుకుంటే ఆ వ్యక్తి ద్రాక్షారసాన్ని గానీ మత్తు కలిగించే పానీయాలు గానీ తీసుకోకూడదు. పులిసిన ద్రాక్షారసం గానీ మద్యాన్ని గానీ తీసుకోకూడదు.
Judges 16:17అప్పుడు సంసోను సమస్తం ఆమెకు తెలియచేశాడు. “నేను పుట్టిన దగ్గర్నుంచి మంగలి కత్తి నా తలపైకి రాలేదు. ఎందుకంటే నేను నా తల్లి గర్భంలోనే దేవునికి నాజీరుగా ఉన్నాను. నా తలపై జుట్టును క్షౌరం చేస్తే నేను అందరిలాగానే సామాన్యుడిగా మారతాను” అని ఆమెకు చెప్పాడు.
1 Samuel 7:13ఈ విధంగా ఫిలిష్తీయులు అణగారిపోయి ఇశ్రాయేలు సరిహద్దుల్లోకి మళ్ళీ రాలేకపోయారు. సమూయేలు జీవించిన కాలమంతటిలో యెహోవా హస్తం ఫిలిష్తీయులకి విరోధంగా ఉంది.
1 Chronicles 18:1ఇది జరిగిన తరువాత దావీదు ఫిలిష్తీయుల మీద దాడి చేసి వాళ్ళను జయించాడు. గాతు పట్టణాన్ని, దాని గ్రామాలను, ఫిలిష్తీయుల ఆధీనంలోనుంచి లాగేసుకున్నాడు.