న్యాయా 15:19
అప్పుడు దేవుడు లేహీలో పల్లంగా ఉన్న ఒక స్థలాన్ని నెర్రె విచ్చేలా చేశాడు. దానిలోనుండి నీళ్ళు ఉబికి వచ్చాయి. అతడు ఆ నీటిని తాగాడు. అతడి ప్రాణం ఉపశమనం పొంది తేరుకున్నాడు. కాబట్టి ఆ ప్రాంతానికి “ఏన్ హక్కోరే + 15:19 ఏన్ హక్కోరే మొరపెట్టేవాడి ఊట ” అనే పేరు వచ్చింది. ఆ ప్రాంతం ఇప్పటికీ లేహీ లో ఉంది.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
20సంసోను ఫిలిష్తీయుల రోజుల్లో ఇరవై సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా ఉన్నాడు.
Cross References
Genesis 16:13అప్పుడు ఆమె “నన్ను చూసినవాడు నాకు నిజంగా కనిపించాడు కదా!” అంది. అందుకనే తనతో మాట్లాడిన యెహోవాకు “ + 16:13 లహాయి రోయినన్ను చూస్తున్న దేవుడివి నువ్వే” అనే పేరు పెట్టింది.
Genesis 30:30నేను రాకముందు నీకున్నది కొంచెమే, అయితే అది బాగా అభివృద్ధి పొందింది. నేను అడుగు పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాడు. అయితే నేను నా స్వంత ఇంటివారి కోసం ఎప్పుడు సంపాదించుకుంటాను?” అన్నాడు.
Exodus 17:15తరువాత మోషే ఒక బలిపీఠం కట్టి దానికి “ + 17:15 యెహోవా నా జెండా.యెహోవా నిస్సీ” అని పేరు పెట్టాడు.
Judges 15:9అప్పుడు ఫిలిష్తీయులు యూదా దేశంపై యుద్ధం చేయడానికై లేహి అనే ప్రాంతంలో సైన్యాన్ని సమకూర్చారు.
Psalms 34:6అణచివేతకు గురైన ఈ వ్యక్తి విలపించాడు. దాన్ని యెహోవా విన్నాడు. సమస్యలన్నిటి నుండి అతణ్ణి రక్షించాడు. 1
Psalms 110:7దారిలో ఏటి నీళ్లు పానం చేస్తాడు. విజయగర్వంతో తన తల పైకెత్తుతాడు.