కీర్తన 110:7
దారిలో ఏటి నీళ్లు పానం చేస్తాడు. విజయగర్వంతో తన తల పైకెత్తుతాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
He shall drink of the brook in the way: therefore shall he lift up the head.
In Context
Cross References
Judges 15:19అప్పుడు దేవుడు లేహీలో పల్లంగా ఉన్న ఒక స్థలాన్ని నెర్రె విచ్చేలా చేశాడు. దానిలోనుండి నీళ్ళు ఉబికి వచ్చాయి. అతడు ఆ నీటిని తాగాడు. అతడి ప్రాణం ఉపశమనం పొంది తేరుకున్నాడు. కాబట్టి ఆ ప్రాంతానికి “ఏన్ హక్కోరే + 15:19 ఏన్ హక్కోరే మొరపెట్టేవాడి ఊట ” అనే పేరు వచ్చింది. ఆ ప్రాంతం ఇప్పటికీ లేహీ లో ఉంది.
Psalms 3:3కాని యెహోవా, నువ్వే నాకు డాలు, నువ్వే నాకు మహిమ, నా తల ఎత్తేవాడివి. 1
Psalms 102:9బూడిదను అన్నం లాగా తింటున్నాను. కన్నీళ్ళతో కలిపి నీళ్ళు తాగుతున్నాను. 1
Jeremiah 23:15కాబట్టి సేనల ప్రభువు యెహోవా ఈ ప్రవక్తలను గురించి చెప్పేదేమిటంటే, యెరూషలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతా వ్యాపించింది. కాబట్టి వాళ్లకు తినడానికి చేదుకూరలూ తాగడానికి విషజలం నేను వారికిస్తాను. 1
Matthew 20:22అందుకు యేసు, “మీరు ఏమి అడుగుతున్నారో మీకు తెలియడం లేదు. నేను తాగబోయే గిన్నెలోది మీరు తాగగలరా?” అని వారిని అడగగా వారు “తాగగలం” అన్నారు.
Luke 24:26క్రీస్తు ఈ విధంగా హింసలు అనుభవించి తన మహిమలో ప్రవేశించడం తప్పనిసరి కాదా?” అని వారితో అన్నాడు.