The Bible Software
bible.softwareLamentationsLamentations 2 › Lamentations 2:16

Lamentations 2:16

నీ శత్రువులందరూ నిన్ను చూసి పెద్దగా నోరు తెరిచారు. వాళ్ళు ఎగతాళి చేసి పళ్ళు కొరుకుతూ “దాన్ని మింగివేశాం! కచ్చితంగా ఈ రోజు కోసమేగా మనం కనిపెట్టింది! అది జరిగింది. దాన్ని మనం చూశాం” అంటున్నారు.

బైబిల్ (తెలుగు)

In The King James Version

All thine enemies have opened their mouth against thee: they hiss and gnash the teeth: they say, We have swallowed her up: certainly this is the day that we looked for; we have found, we have seen it.

In Context

15దారిలో వెళ్ళేవాళ్ళందరూ నిన్ను చూసి చప్పట్లు కొడుతున్నారు. వాళ్ళు యెరూషలేము కుమారిని చూసి ఎగతాళి చేస్తూ ఈల వేస్తూ, తల ఊపుతూ. “పరిపూర్ణ సౌందర్యం గల పట్టణం అనీ, సమస్త భూనివాసులకు ఆనందకరమైన నగరం అనీ ప్రజలు ఈ పట్టణం గురించేనా చెప్పారు?” అంటున్నారు.

17తాను అనుకున్న పని యెహోవా ముగించాడు. తాను పూర్వం ప్రకటించిన మాట ఆయన నెరవేర్చాడు. నీ పట్ల కనికరం లేకుండా ఆయన నాశనం చేశాడు. నిన్ను బట్టి నీ శత్రువులు సంతోషించేలా చేశాడు. నీ విరోధుల బలం హెచ్చించాడు.

Read all of Lamentations 2

Cross References

Job 16:9ఆయన కళ్ళు నా మీద కోపంతో ఎర్రబడ్డాయి. నన్ను చూసి పళ్ళు కొరుకుతూ నా మీద పడి నాతో యుద్ధం చేశాడు. 1

Psalms 35:16గౌరవం ఏమీ లేకుండా వాళ్ళు నన్ను ఎత్తి పొడిచారు. నన్ను చూస్తూ పళ్ళు కొరికారు. 1

Psalms 35:25వాళ్ళు తమ మనస్సుల్లో ఆహా, మేము కోరుకున్నట్టే జరిగింది అని చెప్పే అవకాశం ఇవ్వకు. మేము వాణ్ణి పూర్తిగా నాశనం చేశాం + 35:25 పూర్తిగా నాశనం చేశాం మింగేశాం, అని చెప్పనివ్వకు. 1

Psalms 41:8ఒక చెడ్డ రోగం వాణ్ణి గట్టిగా పట్టుకుంది. ఇప్పుడు వాడు పడకపై ఉన్నాడు. దానిపైనుంచి వాడిక లేవడు అని చెప్పుకుంటారు. 1

Psalms 57:3ఆయన ఆకాశం నుండి సహాయం పంపి నన్ను రక్షిస్తాడు. నన్ను మింగివేయాలని చూసేవారు నాపై దూషణ మాటలు పలికినప్పుడు దేవుడు తన నిబంధన నమ్మకత్వంతో తన కృపాసత్యాలను పంపుతాడు. సెలా. 1

Psalms 112:10భక్తిహీనులు అది చూసి కోపం తెచ్చుకుంటారు. వారు పళ్ళు కొరుకుతూ క్షీణించి పోతారు. భక్తిహీనుల ఆశ భంగమైపోతుంది.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study Lamentations 2:16

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Lamentations 2:15Lamentations 2Lamentations 2:17 →