Lamentations 3:43
నువ్వు కోపం ధరించుకుని మమ్మల్ని తరిమావు. దయ లేకుండా మమ్మల్ని వధించావు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Thou hast covered with anger, and persecuted us: thou hast slain, thou hast not pitied.
In Context
42మేము అతిక్రమం చేసి తిరుగుబాటు చేశాం. అందుకే నువ్వు మమ్మల్ని క్షమించలేదు.
44మా ప్రార్థన నీ దగ్గరికి చేరకుండా నువ్వు మేఘంతో నిన్ను నువ్వు కప్పుకొన్నావు.
Cross References
Psalms 44:19కానీ నువ్వు నక్కలు తిరిగే చోట మమ్మల్ని తీవ్రంగా విరగ్గొట్టావు. చావునీడ కింద మమ్మల్ని కప్పి ఉంచావు. 1
Psalms 83:15నీ తుఫానుతో వాళ్ళను తరిమి వెయ్యి. నీ సుడిగాలిచేత వారికి భయం పుట్టించు. 1
Lamentations 2:17తాను అనుకున్న పని యెహోవా ముగించాడు. తాను పూర్వం ప్రకటించిన మాట ఆయన నెరవేర్చాడు. నీ పట్ల కనికరం లేకుండా ఆయన నాశనం చేశాడు. నిన్ను బట్టి నీ శత్రువులు సంతోషించేలా చేశాడు. నీ విరోధుల బలం హెచ్చించాడు.
Lamentations 3:8నేను కేకలు పెట్టి పిలిచినా, నా ప్రార్థనలు తోసివేశాడు.
Ezekiel 7:9నాకు మీ పట్ల కనికరం లేదు. నేను మిమ్మల్ని వదలను. మీరు చేసినట్టే నేనూ మీకు చేస్తాను. మిమ్మల్ని శిక్షించే యెహోవాను నేనే అని మీకు తెలిసే విధంగా నీచమైన వాటిని మీ మధ్యే ఉండనిస్తాను!
Ezekiel 9:10కాబట్టి నా దృష్టిలో వారి కోసం ఎలాంటి కనికరమూ లేదు. నేను వాళ్ళని వదలను. వీటన్నిటి ఫలితాన్ని వాళ్ళ తలల పైకి తెస్తాను.”