Leviticus 10:15
కదలిక అర్పణగా పైకెత్తిన రొమ్ము భాగాన్నీ, యెహోవాకు ప్రతిష్ట చేసిన తొడ భాగాన్నీ దహనబలిగా అర్పించిన కొవ్వుతో పాటు వాళ్ళు తీసుకురావాలి. వాటిని యెహోవా ఎదుట పైకెత్తి కదిలించే అర్పణగా తీసుకు రావాలి. యెహోవా ఆజ్ఞాపించినట్టు అవి శాశ్వతంగా నీకూ నీ కొడుకులకూ చెందిన భాగం. ఇది ఎప్పటికీ నిలిచి ఉండే చట్టం.”
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Genesis 13:15నువ్వు చూస్తున్న ఈ ప్రదేశం అంతా నీకు, నీ వారసులకు శాశ్వతంగా ఇస్తాను.
Genesis 17:13నీ ఇంట్లో పుట్టిన వారికీ, మీరు వెల పెట్టి కొనుక్కున్న వారికీ తప్పకుండా సున్నతి జరగాలి. ఆ విధంగా నా నిబంధన మీ శరీరంలో శాశ్వత నిబంధన గా ఉంటుంది.
Exodus 29:28ఆ ప్రతిష్టార్పణ అహరోనుది, అతని కొడుకులది అవుతుంది. అది ఇశ్రాయేలు ప్రజలు ఇచ్చిన కానుక. అది నిత్యమూ నిలిచి ఉండే కట్టుబాటు. అది ఇశ్రాయేలు ప్రజలు అర్పించే శాంతి బలుల్లో నుండి యెహోవాకు అర్పించిన కానుక.
Leviticus 7:29“నువ్వు ఇశ్రాయేలు ప్రజలకు ఇలా చెప్పు, యెహోవాకి శాంతిబలి పశువును అర్పించే వాడు దానిలో ఒక భాగాన్ని ప్రత్యేకంగా యెహోవా సమక్షంలోకి తీసుకురావాలి.
Leviticus 7:34ఎందుకంటే నా ఎదుట పైకి లేపి కదిలించిన రొమ్ము భాగాన్నీ, తొడనూ నేను స్వీకరించాను. వాటిని నేను యాజకుడైన అహరోనుకీ, అతని వారసులకీ ఇచ్చాను. ఇశ్రాయేలు ప్రజలు అర్పించే శాంతి బలులన్నిటిలో ఇవి వారి వంతుగా ఉంటాయి. ఇది నా ప్రజలైన ఇశ్రాయేల్ వారు అనుసరించవలసిన శాశ్వత నియమం.