bible.software › Leviticus › Leviticus 8 › Leviticus 8:16
Leviticus 8:16
అప్పుడు మోషే దాని లోపలి భాగాలపై ఉన్న కొవ్వునంతా తీసి వేరు చేశాడు. కాలేయం పైనున్న కొవ్వును తీశాడు. మూత్రపిండాలనూ వాటిపైని కొవ్వునూ తీసి అంతా బలిపీఠంపై దహించాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And he took all the fat that was upon the inwards, and caul above the liver, and the two kidneys, and their fat, and Moses burned it upon the altar.
In Context
15మోషే దాన్ని వధించాడు. దాని రక్తాన్ని తీసి తన వేలితో బలిపీఠం కొమ్ములకి పూసి బలిపీఠాన్ని శుద్ధీకరించాడు. మిగిలిన రక్తాన్ని బలిపీఠం అడుగు భాగంలో కుమ్మరించాడు. మోషే దాని కోసం పరిహారం చేసి దాన్ని ప్రతిష్టించాడు.
17అయితే యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టుగా మోషే ఆ కోడె దూడనూ, దాని చర్మాన్నీ, మాంసాన్నీ, పేడనూ శిబిరం బయట పూర్తిగా కాల్చివేశాడు.
Read all of Leviticus 8
Cross References
Exodus 29:13దాని పేగులకు, కాలేయానికి, రెండు మూత్రపిండాలకు పట్టిన కొవ్వు అంతటినీ తీసివేసి బలిపీఠంపై కాల్చివెయ్యాలి.
Leviticus 4:8తరువాత అతడు పాపం కోసం బలి అర్పణ చేసిన ఆ కోడెదూడ కొవ్వు అంతా కోసి వేరు చేయాలి. దాని అంతర్భాగాలను కప్పి ఉన్న కొవ్వునూ, దాని అంతర్భాగాలను అంటి ఉన్న కొవ్వునూ వేరు చేయాలి.
This Verse In Other Editions
Study Leviticus 8:16