Luke 17:3
మీ వరకూ మీరు జాగ్రత్తగా ఉండండి. అయితే మీ సోదరుడు అపరాధం చేస్తే అతణ్ణి మందలించండి. తన అపరాధం విషయమై అతడు పశ్చాత్తాప పడితే అతణ్ణి క్షమించండి.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Leviticus 19:17నీ హృదయంలో నీ సోదరుణ్ణి అసహ్యించుకోకూడదు. నీ పొరుగువాడి పాపం నీ మీదికి రాకుండేలా నీవు తప్పకుండా అతణ్ణి గద్దించాలి.
Deuteronomy 4:15హోరేబులో యెహోవా అగ్నిజ్వాలల్లో నుండి మీతో మాట్లాడిన రోజు మీరు ఏ స్వరూపాన్నీ చూడలేదు.
2 Chronicles 19:6అతడు న్యాయాధిపతులతో ఇలా చెప్పాడు. “మీరు ఏమి చేయాలో జాగ్రత్తగా ఆలోచించండి, ఎందుకంటే మీరు మనుషుల కోసం కాదు, యెహోవా కోసమే తీర్పు తీర్చాలి. తీర్పు తీర్చే పనిలో ఆయన మీతో ఉంటాడు.
Proverbs 9:8ఎగతాళి చేసేవాణ్ణి గద్దించవద్దు. వాణ్ణి గద్దిస్తే ఒకవేళ వాడు నీపై ద్వేషం పెంచుకుంటాడేమో. జ్ఞానం గలవాడికి హితవాక్కులు బోధిస్తే వాడు నిన్ను ప్రేమిస్తాడు.
Proverbs 27:5లోలోపల ప్రేమించడం కంటే బహిరంగంగా గద్దించడం మేలు.
Matthew 18:21అప్పుడు పేతురు వచ్చి, “ప్రభూ, నా సోదరుడు నా విషయంలో తప్పు చేస్తే నేను ఎన్నిసార్లు అతణ్ణి క్షమించాలి? ఏడు సార్లు సరిపోతుందా?” అని యేసుని అడిగాడు.