Luke 18:14
పరిసయ్యుడి కంటే పన్నులు వసూలు చేసే వాణ్ణే దేవుడు నీతిమంతుడిగా ఎంచాడు. ఇతడు నిర్దోషిగా ఇంటికి తిరిగి వెళ్ళాడని మీతో చెబుతున్నాను. తనను తాను హెచ్చించుకొనే వాణ్ణి తగ్గించడం, తగ్గించుకొనే వాణ్ణి గొప్పచేయడం జరుగుతుంది. 1 యేసు చిన్నపిల్లలను దీవించడం మత్తయి 19:13-15; మార్కు 10:13-16
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Exodus 18:11యెహోవాయే మిగిలిన దేవుళ్ళ కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసింది. ఎందుకంటే ఇశ్రాయేలీయుల పట్ల అహంకారంతో మెలిగిన ఐగుప్టు వారి వశంనుండి ఆయన తన ప్రజలను రక్షించాడు” అన్నాడు.
Job 9:20నేను చేసే వాదన న్యాయంగా ఉన్నప్పటికీ నా మాటలే నా మీద నేరం మోపుతాయి. నేను న్యాయవంతుడినైప్పటికీ దోషినని నా మాటలు రుజువు చేస్తాయి. 1
Job 25:4మనిషి దేవుని దృష్టికి నీతిమంతుడు ఎలా కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎలా శుద్ధుడు కాగలడు? 1
Psalms 138:6యెహోవా మహా ఘనుడైనప్పటికీ ఆయన దీనులను పట్టించుకుంటాడు. గర్విష్ఠుల కదలికలు ఆయన దూరం నుండే పసికడతాడు. 1
Proverbs 3:34ఎగతాళి చేసేవాళ్ళను ఆయన ఎగతాళి చేస్తాడు. దీనమనస్సు గలవారిని ఆయన కనికరిస్తాడు.
Proverbs 16:18ఒకడి గర్వం వాడి పతనానికి దారి చూపుతుంది. అహంకారమైన మనస్సు నాశనానికి నడుపుతుంది.