Luke 20:47
వారు వితంతువుల ఇళ్ళు దిగమింగుతూ కపటంగా దీర్ఘప్రార్థనలు చేస్తుంటారు. వారు మరింత కఠినమైన శిక్ష పొందుతారు” అని తన శిష్యులతో చెప్పాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
46వ్యాపార వీధుల్లో వందనాలను, సమాజమందిరాల్లో పెద్ద ఆసనాలను, విందుల్లో అగ్ర స్థానాలను ఆశిస్తారు.
Cross References
Jeremiah 7:6పరదేశుల్నీ తండ్రి లేని వారినీ వితంతువులనూ బాధించకూడదు. ఈ స్థలంలో నిర్దోషి రక్తం చిందించకూడదు. మీకు హాని చేసే అన్య దేవతలను పూజించకూడదు.
Ezekiel 33:31నా ప్రజలు ఎప్పుడూ వచ్చేలాగే నీ దగ్గరికి వస్తారు. నీ ఎదుట కూర్చుని నీ మాటలు వింటారు గాని వాటిని పాటించరు. సరైన మాటలు వాళ్ళు చెబుతారు గానీ వాళ్ళ మనసులు అక్రమ లాభం కోసం ఆరాటపడుతున్నాయి.
Amos 8:4దేశంలోని పేదలను తీసేస్తూ దీనులను అణిచేసే మీరు ఈ విషయం వినండి.
Micah 2:8ఇటీవలే నా ప్రజలు శత్రువులయ్యారు. 1 యుద్ధరంగం నుంచి క్షేమంగా తిరిగి వస్తున్నాం అని సైనికులు అనుకున్నట్టుగా, 1 నిర్భయంగా దారిన పోతూ ఉన్న వారి పై బట్టలను, అంగీని మీరు లాగివేస్తారు.
Matthew 11:22తీర్పు దినాన మీకు పట్టే గతి కంటే తూరు సీదోను పట్టణాల వారి గతే ఓర్చుకోదగినది అవుతుంది అని మీతో చెప్తున్నాను.
Matthew 23:14మీరు అందులో ప్రవేశించరు, ఇతరులను ప్రవేశించనియ్యరు.