Luke 23:51
మహాసభ చేసిన తీర్మానానికి ఇతడు సమ్మతించలేదు. ఇతడు దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
50యూదుల మహాసభలో యోసేపు అనే వ్యక్తి ఉన్నాడు. ఇతడు అరిమతయి ఊరివాడు. మంచివాడు, నీతిపరుడు.
52అతడు పిలాతు దగ్గరికి వెళ్ళి, యేసు శరీరాన్ని తనకిమ్మని అడిగాడు.
Cross References
Genesis 37:21రూబేను ఆ మాట విని “మనం వాణ్ణి చంపకూడదు” అని చెప్పి వారి చేతుల్లో చావకుండా యోసేపును తప్పించాడు.
Genesis 49:18యెహోవా, నీ రక్షణ కోసం కనిపెడుతున్నాను. 1
1 Samuel 1:1ఎఫ్రాయిము కొండ ప్రాంతంలో రామతయిము-సోఫీము అనే ఊరిలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతని పేరు ఎల్కానా. అతడు యెరోహాము కొడుకు. యెరోహాము ఎలీహు కొడుకు. ఎలీహు తోహు కొడుకు. తోహు సూపు కొడుకు. సూపు ఎఫ్రాయీము గోత్రంవాడు. ఎల్కానాకు ఇద్దరు భార్యలు.
Isaiah 8:12ఈ ప్రజలు కుట్ర అని చెప్పేదంతా కుట్ర అనుకోకండి. 1 వారు భయపడే దానికి భయపడకండి. హడలి పోకండి. 1
Luke 2:25యెరూషలేములో సుమెయోను అనే ఒక వృద్ధుడు ఉన్నాడు. అతడు న్యాయవంతుడు, భక్తిపరుడు. ఇశ్రాయేలుకు కలగబోయే ఆదరణ కోసం ఎదురు చూసేవాడు. పరిశుద్ధాత్మ అతనిపై ఉన్నాడు.
Luke 23:42తరువాత ఆయనను చూసి, “యేసూ, నువ్వు నీ రాజ్యంలో ప్రవేశించేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో” అన్నాడు.