Mark 9:29
ఆయన వారితో, “ఈ రకమైన దయ్యాన్ని ప్రార్థన వల్ల మాత్రమే వెళ్ళగొట్టగలం” అని జవాబు చెప్పాడు. 1 యేసు తన మరణాన్ని గురించి ముందుగా చెప్పడం మత్తయి 17:22-23; లూకా 9:43-45
బైబిల్ (తెలుగు)
In The King James Version
And he said unto them, This kind can come forth by nothing, but by prayer and fasting.
In Context
30వారు అక్కడ నుండి బయలుదేరి గలిలయ ప్రాంతం మీదుగా దాటిపోయారు. ఆ సంగతి ఎవరికీ తెలియకూడదని యేసు ఆశించాడు.
Cross References
2 Kings 4:33కాబట్టి ఎలీషా లోపలికి వెళ్ళి తలుపులు వేశాడు. తానూ, ఆ పిల్లవాడూ మాత్రమే లోపల ఉండగా యెహోవాకు విజ్ఞాపన చేశాడు.
Matthew 12:45అప్పుడది వెళ్ళి తనకంటే చెడ్డవైన మరో ఏడు దయ్యాలను వెంటబెట్టుకుని వస్తుంది. అవన్నీ అక్కడే నివాసముంటాయి. అందుచేత ఆ వ్యక్తి చివరి స్థితి మొదటి దాని కంటే అధ్వాన్నం అవుతుంది. ఈ దుష్టతరం వారికీ అలాగే అవుతుంది.” 1 సరికొత్త సంబంధాలు మార్కు 3:31-35; లూకా 8:19-21
Matthew 17:21మీకు అసాధ్యమైంది ఏదీ ఉండదు” అని వారితో చెప్పాడు. 1 క్రీస్తు తన మరణ పునరుత్థానాలను గురించి మళ్లీ చెప్పడం మార్కు 9:30-32; లూకా 9:43-45
Acts 9:40పేతురు అందరినీ బయటికి పంపి మోకరించి ప్రార్థన చేశాడు. తరువాత ఆ శవం వైపు తిరిగి, “తబితా, లే” అనగానే ఆమె కళ్ళు తెరచి పేతురును చూడగానే లేచి కూర్చుంది.
1 Corinthians 9:27ఇతరులకు ప్రకటించిన తరువాత ఒక వేళ నేనే అర్హత కొల్పోతానేమోనని నా శరీరాన్ని నలగగొట్టి, దాన్ని నాకు లోబరచుకొంటున్నాను.
2 Corinthians 11:27కష్ట పడ్డాను. వేదన అనుభవించాను. నిద్ర కరువైన అనేక రాత్రులు గడిపాను. చలితో, ఆకలి దప్పులతో, తినడానికి ఏమీ లేక, బట్టల్లేక ఉన్నాను.