Matthew 24:27
“మెరుపు తూర్పు వైపున పుట్టి పడమర వైపుకు ఏవిధంగా కనిపిస్తుందో, ఆ విధంగా మనుష్య కుమారుడి రాక కూడా ఉంటుంది.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
28శవం ఎక్కడ ఉంటే అక్కడ రాబందులు పోగవుతాయి.
Cross References
Job 37:3ఆకాశ వైశాల్యమంతటి కింద ఆయన దాన్ని వినిపిస్తాడు. భూమి కొనల దాకా తన మెరుపును పంపిస్తాడు. 1
Isaiah 30:30యెహోవా తన స్వరంలోని వైభవాన్ని వినిపిస్తాడు. ప్రభావంగల స్వరం వినిపిస్తాడు. ప్రచండమైన కోపంతోను దహించే జ్వాలతోను తుఫాను వంటి తన ఉగ్రతలో, అగ్ని జ్వాలల్లో, భీకరమైన సుడిగాలితో, గాలి వానతో, వడగళ్ళతో తన చేతి కదలికను చూపిస్తాడు. 1
Malachi 3:2ఆయన రాకడ దినం ఎవరు తట్టుకోగలడు? ఆయన కనబడినప్పుడు ఎవరు నిలబడి ఉండగలరు? ఆయన కంసాలి కొలిమిలో ఉండే నిప్పులాంటివాడు, చాకలి చేతిలోని సబ్బు వంటివాడు.
Matthew 8:20అందుకు యేసు అతనితో, “నక్కలకు గుంటలున్నాయి. పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడికి మాత్రం తల వాల్చుకునే స్థలం కూడా లేదు” అన్నాడు.
Matthew 24:3ఆయన ఒలీవ కొండమీద కూర్చుని ఉండగా శిష్యులు ఆయన దగ్గరికి ఏకాంతంగా వచ్చి, “నువ్వు చెప్పిన విషయాలు ఎప్పుడు జరుగుతాయి? నీ రాకడకూ, లోకాంతానికీ సంకేతాలు మాకు చెప్పు” అని అడిగారు. 1 ఈ యుగం పరిణామాలు మార్కు 13:5, 13; లూకా 21:8-19
Matthew 24:39జలప్రళయం వచ్చి వారంతా కొట్టుకునిపోయే వరకూ వారికి తెలియలేదు. ఆ విధంగానే మనుష్య కుమారుడి రాకడ ఉంటుంది.