Micah 4:10
సీయోను కూతురా, ప్రసవ వేదన పడుతున్న స్త్రీ లాగా 1 నొప్పులు పడుతూ కను. 1 ఎందుకంటే మీరు పొలంలో బతికేలా పట్టణం వదిలిపెట్టండి. 1 బబులోను వెళ్తారు. అక్కడ మీకు విడుదల కలుగుతుంది. 1 అక్కడే యెహోవా మీ శత్రువుల చేతిలోనుంచి మిమ్మల్ని విడిపిస్తాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
2 Kings 20:18ఇంకా నీ కడుపున పుట్టిన నీ కొడుకుల సంతతిని వారు బబులోను రాజు నగరానికి తీసుకు వెళ్తారు. అక్కడ వారు నపుంసకులు అవుతారు” అన్నాడు.
2 Chronicles 33:11కాబట్టి యెహోవా అష్షూరురాజు సైన్యాధిపతులను వారిమీదికి రప్పించాడు. వారు మనష్షేను పట్టుకుని, గొలుసులతో బంధించి అతణ్ణి బబులోను తీసుకు వెళ్ళారు.
2 Chronicles 36:23“పారసీకదేశపు రాజు కోరెషు ఆజ్ఞాపించేది ఏంటంటే పరలోకంలో ఉన్న దేవుడైన యెహోవా అన్ని రాజ్యాలనూ నా వశం చేశాడు. యూదాలో ఉన్న యెరూషలేములో తనకు మందిరాన్ని కట్టించమని నాకు ఆజ్ఞాపించాడు. ఆయన ప్రజలైన మీరెవరైనా యెరూషలేము వెళ్ళవచ్చు. మీ దేవుడైన యెహోవా మీకు తోడుగా ఉంటాడు గాక.”
Psalms 106:10పగవారి చేతిలోనుండి వారిని రక్షించాడు. శత్రువుల చేతిలోనుండి వారిని విమోచించాడు. 1
Isaiah 45:13నీతిని బట్టి కోరెషును ప్రేరేపించాను, అతని మార్గాలన్నిటినీ తిన్నగా చేస్తాను. అతడు నా పట్టణాన్ని కట్టిస్తాడు, 1 ఏమీ వెల గానీ, లంచం గానీ పుచ్చుకోకుండానే చెరలో ఉన్నవారిని అతడు విడిపిస్తాడు.” 1
Isaiah 52:9యెరూషలేము శిథిలాల్లారా! కలిసి ఆనంద గీతాలు పాడండి. యెహోవా తన ప్రజలను ఆదరించాడు. యెరూషలేమును విమోచించాడు. 1