Micah 7:19
నువ్వు మళ్ళీ మమ్మల్ని కనికరిస్తావు. 1 నీ పాదాల కింద మా అపరాధాలను నువ్వు తొక్కేస్తావు. 1 మా పాపాలన్నిటినీ సముద్రం అడుగుకు నువ్వు పడవేస్తావు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Deuteronomy 30:6మీరు బతకడానికి, హృదయపూర్వకంగా సంపూర్ణ ఆత్మతో మీ యెహోవా దేవుని ప్రేమించేలా మీ యెహోవా దేవుడు మీ హృదయానికీ మీ పిల్లల హృదయానికీ సున్నతి చేస్తాడు.
2 Samuel 24:14అందుకు దావీదు “గొప్ప చిక్కులో పడ్డాను. యెహోవా కరుణా సంపన్నుడు గనక మనుషుల చేతిలో పడడం కంటే యెహోవా చేతిలోనే పడదాము” అని గాదుతో అన్నాడు.
Psalms 85:3నీ ఉగ్రతనంతా మానుకున్నావు, నీ తీవ్ర కోపాన్ని చల్లార్చుకున్నావు. 1
Psalms 103:12పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన పాపాల అపరాధ భావన కూడా మననుంచి అంత దూరం చేశాడు. 1
Isaiah 33:24సీయోనులో నివాసం చేసే వాళ్ళెవ్వరూ “నాకు ఆరోగ్యం బాగా లేదు” అని చెప్పరు. అక్కడి ప్రజలు చేసిన పాపాలకు క్షమాపణ దొరుకుతుంది.
Isaiah 43:25ఇదిగో, నేను, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమాలను తుడిచి వేస్తున్నాను. నేను నీ పాపాలను జ్ఞాపకం చేసుకోను. 1