Numbers 23:24
చూడు, ఆ ప్రజలు ఆడసింహంలా లేస్తారు, 1 ఆ జాతి సింహంలా బయటకు వచ్చి వేటాడుతుంది. 1 చంపిన దాన్ని తిని, దాని రక్తం తాగే వరకూ అది పండుకోదు” అని పలికాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
25అప్పుడు బాలాకు బిలాముతో “వారిని శపించడం గాని, ఆశీర్వదించడం గాని ఏదీ చెయ్యొద్దు” అన్నాడు.
Cross References
Genesis 49:27బెన్యామీను ఆకలిగొన్న తోడేలు. 1 అతడు ఉదయాన ఎరను మింగి, 1 దోచుకున్న దాన్ని, సాయంత్రం వేళ పంచుకుంటాడు.” 1 యాకోబు మరణం, సమాధి
Numbers 24:9అతడు సింహంలా, ఆడ సింహంలా పొంచి ఉంటాడు. అతని విశ్రాంతికి భంగం కలిగించేవాడెవడు? అతన్ని దీవించే ప్రతివాడికీ దీవెన వస్తుంది గాక, అతన్ని శపించే ప్రతివాడికీ శాపం వస్తుంది గాక” అన్నాడు.
Deuteronomy 33:20గాదు గురించి మోషే ఇలా పలికాడు. 1 గాదు ప్రాంతాన్ని విశాలం చేసేవాడికి దీవెన. 1 ఆ గోత్రం ఆడ సింహంలా పొంచి ఉంటుంది 1 చేతిని, నడినెత్తిని చీల్చివేస్తుంది. 1
2 Chronicles 9:18ఆ సింహాసనానికి ఆరు బంగారు మెట్లు ఉన్నాయి. సింహాసనానికి బంగారు పాదపీఠం కట్టి ఉంది. కూర్చునే చోటికి రెండు వైపులా చేతి ఊతలున్నాయి. ఊతల దగ్గర రెండు సింహాలున్నాయి.
Proverbs 30:30అవి మృగాలన్నిటిలో బలం కలిగి ఎవరికీ భయపడి వెనుదిరుగని సింహం,
Daniel 2:44ఆ రాజుల కాలంలో పరలోకంలో ఉన్న దేవుడు శాశ్వతంగా నిలిచి ఉండే వేరే ఒక రాజ్యం నెలకొల్పుతాడు. ఆ రాజ్యాన్ని పొందిన వాళ్ళ చేతుల్లో నుంచి దాన్ని వేరే ఇంకెవ్వరూ స్వాధీనం చేసుకోలేరు. అది ముందు చెప్పిన రాజ్యాలన్నిటినీ తుత్తునియలు చేస్తుంది. అది శాశ్వతంగా నిలుస్తుంది.