Numbers 24:7
అతడు నీరు తోడుకునే చేదల నుండి నీళ్ళు కారుతాయి. అతడు నాటిన విత్తనానికి సమృద్ధిగా నీళ్ళు అందుతాయి. వారి రాజు అగగు కంటే గొప్పవాడౌతాడు. వారి రాజ్యం ఘనత పొందుతుంది.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
1 Samuel 15:32సమూయేలు “అమాలేకీయుల రాజు అగగును నా దగ్గరికి తీసుకు రండి” అన్నాడు. అగగు ఆనందంగా అతని దగ్గరకి వచ్చి “నాకు మరణ శిక్ష తప్పిపోయిందా” అన్నాడు.
1 Kings 4:21నది (యూఫ్రటీసు) మొదలుకుని ఐగుప్తు సరిహద్దు వరకూ ఆ మధ్యలో ఉన్న రాజ్యాలన్నిటి మీదా ఫిలిష్తీయుల దేశమంతటి మీదా సొలొమోను అధికారం ఉంది. సొలొమోను బతికిన కాలమంతా ఆ ప్రజలు అతనికి పన్ను చెల్లిస్తూ, అణిగిమణిగి ఉన్నారు. 1 సొలొమోను గృహ భోజన సామగ్రి
1 Chronicles 14:2తన ప్రజలైన ఇశ్రాయేలీయుల కోసం యెహోవా అతని రాజ్యాన్ని ఉన్నత స్థితికి తెచ్చాడనీ, ఆయన తనను ఇశ్రాయేలీయుల మీద రాజుగా స్థిరపరిచాడనీ దావీదు గ్రహించాడు.
Esther 3:1ఈ విషయాలు జరిగాక అహష్వేరోషు రాజు హమ్మెదాతా కొడుకు, అగగు వంశం వాడు అయిన హామానుకు పదోన్నతి కలిగించి, అతని అధికార హోదాను తన దగ్గరున్న అధిపతులందరికంటే ఎక్కువగా చేశాడు.
Psalms 18:43ప్రజల కలహాల నుంచి నువ్వు నన్ను కాపాడావు. జాతులకు నన్ను సారధిగా చేశావు. నేను ఎరగని ప్రజలు నన్ను సేవిస్తున్నారు. 1
Psalms 72:11రాజులందరూ అతని ఎదుట సాగిలపడతారు గాక. అన్యజనాలు అతనికి సేవ చేస్తారు గాక. 1