Philippians 2:12
నా ప్రియ సహ విశ్వాసులారా, మీరెప్పుడూ లోబడుతున్నట్టుగానే, నేను మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కాకుండా, మరి ఎక్కువగా మీతో లేనప్పుడు, భయభక్తులతో మీ సొంత రక్షణను కొనసాగించుకోండి.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Ezra 10:3ఈ పని ధర్మశాస్త్ర నియమం ప్రకారం జరిగేలా నాయకుడవైన నువ్వు, దేవుడంటే భయపడేవారూ చెబుతున్నట్టు మేము పెళ్లి చేసుకొన్న భార్యలను, వారికి పుట్టిన పిల్లలను విడిచిపెట్టి, పంపివేస్తామని మన దేవుని పేరట ఒట్టు పెట్టుకుంటాం.
Psalms 119:120నీ భయం వలన నా శరీరం వణికిపోతోంది. నీ న్యాయవిధులకు నేను భయపడుతున్నాను. అయిన్ 1
Proverbs 13:4సోమరిపోతు ఎక్కువగా ఆశ పడతాడు గానీ వాడికి ఏమీ మిగలదు. కష్టపడి పని చేసేవాడు సుఖంగా జీవిస్తాడు.
Isaiah 66:5యెహోవా వాక్కుకు భయపడే వారలారా, ఆయన మాట వినండి. 1 “మీ సోదరులు మిమ్మల్ని ద్వేషిస్తూ నా పేరును బట్టి మిమ్మల్ని తోసేస్తూ ఇలా అన్నారు, 1 ‘మీ సంతోషం మాకు కనిపించేలా యెహోవాకు ఘనత కలుగు గాక.’ 1 అయితే వాళ్ళు సిగ్గు పాలవుతారు. 1
Matthew 11:29నేను దీనుణ్ణి, వినయ మనసు గల వాణ్ణి. కాబట్టి మీ మీద నా కాడి ఎత్తుకుని నా దగ్గర నేర్చుకోండి. అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి లభిస్తుంది.
John 6:27పాడైపోయే ఆహారం కోసం కష్టపడవద్దు, నిత్యజీవం కలగజేసే పాడైపోని ఆహారం కోసం కష్టపడండి. దాన్ని మనుష్య కుమారుడు మీకిస్తాడు. దానికోసం తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి అధికారమిచ్చాడు” అని చెప్పాడు.