Proverbs 12:14
మనిషి తన నోటి మాటల ఫలం మూలంగా మంచితనంతో తృప్తి పొందుతాడు. ఎవరు చేసే పనులను బట్టి వాళ్ళకు ఫలితం దక్కుతుంది.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
13వ్యర్ధమైన మాటల వల్ల కలిగే దోషం ప్రాణాంతకమైన ఉరి వంటిది. నీతిమంతులు ఆపదలను తప్పించుకుంటారు.
15మూర్ఖుడు నడిచే మార్గం వాడి దృష్టికి సరియైనదిగా అనిపిస్తుంది. జ్ఞానం గలవాడు మంచి మాటలు ఆలకిస్తాడు.
Cross References
Psalms 63:5కొవ్వు, మూలుగ తిన్నట్టుగా నా ప్రాణం తృప్తిగా ఉంది. ఆనందించే పెదాలతో నా నోరు నిన్ను కీర్తిస్తుంది. 1
Proverbs 13:2మనిషి తన నోటి నుంచి వచ్చే మాటల వలన ప్రతిఫలం పొందుతాడు. నమ్మకద్రోహులు తమ దుష్ట క్రియల చేత నాశనం తెచ్చుకుంటారు.
Proverbs 15:23సరియైన సమాధానం ఇచ్చినప్పుడు సంతోషం కలుగుతుంది. సమయోచితమైన మాట ఎంత మనోహరం!
Isaiah 3:10నీకు మేలు కలుగుతుందని నీతిమంతుడితో చెప్పు. 1 వాళ్ళు తమ క్రియల ఫలం అనుభవిస్తారు. 1
Jeremiah 21:14మీ పనులకు తగినట్టు మిమ్మల్ని దండిస్తాను. అడవుల్లో నిప్పు పెడతాను. అది దాని చుట్టూ ఉన్నదాన్నంతా కాల్చివేస్తుంది.” ఇది యెహోవా వాక్కు.
Matthew 16:27మనుష్య కుమారుడు తన తండ్రి మహిమతో దూతలను తోడుకుని వస్తాడు. అప్పుడు ఆయన ప్రతి వ్యక్తికీ వాడు చేసిన పనుల ప్రకారం ప్రతిఫలం ఇస్తాడు.