Proverbs 20:13
అతిగా నిద్ర పోవద్దు. లేకపోతే దరిద్రం ముంచుకు వస్తుంది. మేలుకుని ఉంటే కడుపు నిండా ఆహారం ఉంటుంది.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Love not sleep, lest thou come to poverty; open thine eyes, and thou shalt be satisfied with bread.
In Context
12వినగల చెవి చూడగల కన్ను ఈ రెంటిని యెహోవాయే చేశాడు.
14కొనేవాడు నాసిరకం అంటాడు. అవతలికి వెళ్లి దాన్నే మెచ్చుకుంటాడు.
Cross References
Proverbs 6:11అందువల్ల దోపిడీ దొంగ వచ్చినట్టు దరిద్రం నీకు ప్రాప్తిస్తుంది. ఆయుధం ధరించిన శత్రువు వలే లేమి నీ దగ్గరికి వస్తుంది.
Proverbs 12:11తన భూమిని సేద్యం చేసుకునే వాడికి ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది. బుద్ధిహీనుడు వ్యర్థమైన వాటిని అనుసరిస్తాడు.
Proverbs 19:15సోమరితనం గాఢనిద్రలో పడేస్తుంది. పని చేయడం ఇష్టం లేని వాడు పస్తులుంటాడు.
Jonah 1:6అప్పుడు ఓడ నాయకుడు అతని దగ్గరికి వచ్చి “నువ్వేం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు! ఒకవేళ నీ దేవుడు మనలను గమనించి మనం నాశనం కాకుండా చూస్తాడేమో” అన్నాడు.
Romans 13:11కాబట్టి మీరు కాలాన్ని పరిశీలించి, నిద్ర నుండి మేల్కొన వలసిన సమయం అయ్యిందని గ్రహించండి. మనం మొదట విశ్వాసులం అయినప్పటి కంటే, మన రక్షణ ఇప్పుడు మరింత దగ్గరగా ఉంది.
Ephesians 5:14బట్టబయలైన ప్రతిదీ వెలుగే. అందుకే, 1 నిద్రిస్తున్న నువ్వు మేలుకో. 1 చనిపోయిన వారిలో నుండి లే. 1 క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు, అని రాసి ఉంది.