Proverbs 20:6
నేను నమ్మదగిన వాణ్ణి అని చాలామంది చెప్పుకుంటారు. అయితే నమ్మదగిన వాడు ఎవరికి కనిపిస్తాడు?
బైబిల్ (తెలుగు)
In The King James Version
Most men will proclaim every one his own goodness: but a faithful man who can find?
In Context
5మనిషి హృదయంలోని ఆలోచన లోతైన నీళ్ల వంటిది. వివేకం గలవాడు దాన్ని చేదుకుంటాడు.
7యథార్థవర్తనుడు తన నీతిలో నడుచుకుంటాడు. అతని తదనంతరం అతని పిల్లలు ధన్యులౌతారు.
Cross References
Psalms 12:1యెహోవా నాకు సహాయం చెయ్యి, ఎందుకంటే, భక్తిపరులు అదృశ్యమై పోయారు. నమ్మకస్తులు కనిపించడం లేదు. 1
Proverbs 25:14ఏమీ ఇవ్వకుండానే ఇచ్చానని సొంత డబ్బా వాయించుకునే వాడు వర్షం లేని మబ్బుతో గాలితో సమానం.
Ecclesiastes 7:28అదేమంటే వెయ్యి మంది పురుషుల్లో నేనొక్క నిజాయితీపరుణ్ణి చూశాను గాని స్త్రీలందరిలో ఒక్కరిని కూడా చూడలేదు.
Micah 7:1నాకెంతో బాధగా ఉంది! 1 వేసవికాలపు పండ్లు కోసుకున్న తరువాత, 1 ద్రాక్షతోటల్లో మిగిలిపోయిన ద్రాక్షపండ్ల పరిగె కూడా ఏరుకున్న తరువాత ఎలా ఉంటుందో, నా పరిస్థితి ఆలా ఉంది. 1 పండ్ల గుత్తులు ఇక ఏమీ లేవు. 1 అయినా నేను మొదటి అంజూరపు పండ్ల కోసం ఆశతో ఉన్నాను. 1
Matthew 6:2కాబట్టి దానం చేసేటప్పుడు వేషధారుల్లాగా మీ ముందు బాకా ఊదించుకోవద్దు. ప్రజలు తమను మెచ్చుకోవాలని ఈ కపట భక్తులు సమాజ మందిరాల్లో, వీధుల్లో అలా చేస్తారు. వారి పూర్తి ప్రతిఫలం వారికి దొరికిందని కచ్చితంగా చెబుతున్నాను.
Luke 18:11పరిసయ్యుడు నిలబడి, ‘దేవా, నేను దొంగలూ, అన్యాయం చేసేవారూ, వ్యభిచారులూ అయిన ఇతరుల్లా కాకుండా, ఇంకా ఈ పన్నులు వసూలు చేసే వాడిలా కాకుండా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.