కీర్తన 73:18
నువ్వు వారిని కాలుజారే స్థలంలో ఉంచావు. నువ్వు వారిని పడదోసినప్పుడు వారు నశిస్తారు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
Surely thou didst set them in slippery places: thou castedst them down into destruction.
In Context
17నేను దేవుని పరిశుద్ధ స్థలంలోకి వెళ్లి ధ్యానించినప్పుడు వారి గతి ఏమిటో గ్రహించ గలిగాను. 1
19ఒక్క క్షణంలో వారు అంతమైపోతారు. విపరీతమైన భయంతో నశించిపోతారు. 1
Cross References
Deuteronomy 32:35వారి కాలు జారే కాలంలో పగ తీర్చే పని నాదే. 1 ప్రతిఫలమిచ్చేది నేనే. 1 వారి ఆపద్దినం దగ్గర పడింది. 1 వారి అంతం త్వరగా వస్తుంది. 1
Psalms 37:20అయితే దుష్టులు నశించిపోతారు. యెహోవా విరోధుల కీర్తి పచ్చిక బయళ్ళ చందంగా ఉంటుంది. వాళ్ళు సమసిపోయి పొగలాగా కనిపించకుండా పోతారు. 1
Psalms 37:35భీకరుడైన దుర్మార్గుడు స్వంత నేలలో పెరిగిన పెద్ద పచ్చని చెట్టులా విస్తరించడం నేను చూశాను. 1
Psalms 92:7దుర్మార్గులు పచ్చని గడ్డి మొక్కల్లాగా మొలిచినా చెడ్డపనులు చేసే వాళ్ళంతా వర్ధిల్లినా నిత్యనాశనానికే గదా! 1
Psalms 94:23ఆయన వాళ్ళ దోషం వాళ్ళ మీదికి రప్పిస్తాడు. వాళ్ళ చెడుతనంలోనే వాళ్ళను నాశనం చేస్తాడు. మన యెహోవా దేవుడు వాళ్ళను నాశనం చేస్తాడు.
2 Thessalonians 1:9-10 ఆ రోజున తన పరిశుద్ధులు ఆయనను మహిమ పరచడానికీ, విశ్వసించిన వారికి ఆశ్చర్య కారకంగా ఉండటానికీ ఆయన వచ్చినప్పుడు అవిశ్వాసులు ప్రభువు సన్నిధి నుండీ, ఆయన ప్రభావ తేజస్సు నుండీ వేరై శాశ్వత నాశనం అనే దండన పొందుతారు. ఆ పరిశుద్ధుల్లో మీరూ ఉన్నారు. ఎందుకంటే మేము చెప్పిన సాక్ష్యం మీరు నమ్మారు.