కీర్తన 76:6
యాకోబు దేవా, యుద్ధంలో నీ గద్దింపుకు గుర్రం, రౌతు కూడా మూర్ఛిల్లారు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
At thy rebuke, O God of Jacob, both the chariot and horse are cast into a dead sleep.
In Context
5గుండె ధైర్యం గలవారు దోపిడికి గురి అయ్యారు. నిద్రపోయారు. శూరులంతా నిస్సహాయులయ్యారు. 1
7నీకు, నీకు మాత్రమే భయపడాలి. నువ్వు కోపపడితే నీ ఎదుట ఎవరు నిలుస్తారు? 1
Cross References
Exodus 14:27మోషే సముద్రం పైకి తన చెయ్యి చాపాడు. సాయంత్రం అయ్యేటప్పటికి సముద్రం వడిగా మళ్ళీ కలిసిపోయింది. అది చూసిన ఐగుప్తు సైన్యం వెనక్కి పారిపోవాలని చూశారు. అప్పుడు యెహోవా సముద్రం మధ్యలో ఐగుప్తు సైన్యం నాశనమయ్యేలా చేశాడు.
Exodus 15:4ఆయన ఫరో రథాలను, సైన్యాన్ని సముద్రంలో ముంచివేశాడు. 1 సైన్యాధిపతుల్లో ప్రముఖులు ఎర్ర సముద్రంలో మునిగిపోయారు. 1
Exodus 15:21మిర్యాము వాళ్ళతో కలిసి ఈ విధంగా పాడింది. 1 మిర్యాము కీర్తన “యెహోవాను స్తుతిస్తూ పాటలు పాడండి, ఆయన ఘన విజయం సాధించాడు, శత్రువు గుర్రాలను, వాటి రౌతులను సముద్రంలో ముంచి వేశాడు.”
2 Samuel 10:18అరామీయులు యుద్ధ వ్యూహం సిద్ధపరచుకుని దావీదును ఎదుర్కున్నారు. దావీదు అరామీయుల్లో ఏడు వందలమంది రథికులను, నలభై వేలమంది గుర్రపు రౌతులను హతమార్చాడు. యుద్ధంలో ఇశ్రాయేలీయుల ముందు నిలబడలేక పారిపోయారు. వారి సైన్యాధిపతి షోబకు దావీదు చేతిలో ఓడిపోయి అక్కడే చనిపోయాడు.
2 Chronicles 32:21యెహోవా ఒక దూతను పంపాడు. అతడు అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలులందరినీ సేనా నాయకులనూ అధికారులనూ చంపేశాడు. అష్షూరు రాజు అవమానంతో తన దేశానికి తిరిగి వెళ్లిపోయాడు. అతడు తన దేవుని గుడిలోకి వెళితే అతని సొంత కొడుకులే అతణ్ణి అక్కడ కత్తితో చంపేశారు.
Psalms 80:16దాన్ని నరికి కాల్చివేశారు, నీ గద్దింపుతో నీ శత్రువులు నశించుదురు గాక. 1