The Bible Software
bible.software › ప్రకటన గ్రంథము › ప్రకటన గ్రంథము 12 › ప్రకటన గ్రంథము 12:3

ప్రకటన గ్రంథము 12:3

ఇంతలో పరలోకంలో మరో సంకేతం కనిపించింది. అది రెక్కలున్న మహా సర్పం. వాడికి ఏడు తలలున్నాయి. పది కొమ్ములున్నాయి. వాడి ఏడు తలలపై ఏడు కిరీటాలున్నాయి.

బైబిల్ (తెలుగు)

In The King James Version

And there appeared another wonder in heaven; and behold a great red dragon, having seven heads and ten horns, and seven crowns upon his heads.

In Context

2ఆమె నిండు చూలాలు. పురిటి నొప్పులకు తీవ్ర వేదన పడుతూ కేకలు వేస్తూ ఉంది. 1 సాతాను

4వాడు తన తోకతో ఆకాశంలో ఉన్న నక్షత్రాల్లో మూడవ భాగాన్ని ఈడ్చి వాటిని భూమి మీదికి విసిరికొట్టాడు. ఆ మహాసర్పం కనడానికి నొప్పులు పడుతున్న స్త్రీకి ఎదురుగా నిలబడ్డాడు. ఆ స్త్రీ బిడ్డకు జన్మ నివ్వగానే ఆ బిడ్డను మింగివేయాలన్నది వాడి ఉద్దేశం. 1 మగ బిడ్డ-క్రీస్తు

Read all of ప్రకటన గ్రంథము 12

Cross References

Isaiah 27:1ఆ రోజున యెహోవా చేతితో తన కత్తి పట్టుకుంటాడు. ఆ కత్తి గొప్పది, తీక్షణమైనది, గట్టిది. భీకరమైన సర్పాన్ని, మొసలి రూపాన్ని పోలిన “లేవియాతాన్” ను ఆయన శిక్షిస్తాడు. వంకరలు తిరుగుతూ, జారిపోతున్న సర్పాన్ని శిక్షిస్తాడు. ఆ సముద్ర జీవిని ఆయన సంహరిస్తాడు. 1

Daniel 2:41విగ్రహానికున్న కాళ్ళు, కాలి వేళ్ళు కొంత భాగం బంకమట్టితో, కొంత భాగం ఇనుముతో చేసినట్టు మీకు కనబడ్డాయి కనుక ఆ విధంగా ఆ నాలుగో రాజ్యంలో విభేదాలు ఉంటాయి. ఇనుము బంకమట్టితో కలిసి ఉన్నట్టు మీరు చూశారు కాబట్టి ఆ రాజ్యంలో ఆ విధంగా ఉంటుంది. ఆ రాజ్యం ఇనుములాగా బలం కలిగి ఉంటుంది.

Daniel 7:7తరువాత రాత్రి వేళ నాకు దర్శనాలు కలిగినప్పుడు నేను చూస్తుంటే, ఘోరమైన, భీకరమైన, మహా బలిష్ఠమైన నాలుగవ జంతువొకటి కనబడింది. అది తనకు ముందున్న ఇతర జంతువులకు భిన్నమైనది. దానికి పెద్ద ఇనుప దంతాలు, పది కొమ్ములు ఉన్నాయి. అది సమస్తాన్నీ భక్షిస్తూ తుత్తునియలు చేస్తూ మిగిలిన దాన్ని కాళ్లతో తొక్కేస్తూ ఉంది.

Daniel 7:24ఆ పది కొమ్ములు ఆ రాజ్యం నుండి పుట్టబోయే పదిమంది రాజులను సూచిస్తున్నాయి. చివర్లో ముందుగా ఉన్న రాజులకు భిన్నమైన మరొక రాజు పుట్టి ఆ ముగ్గురు రాజులను కూల్చి వేస్తాడు.

Revelation 12:4వాడు తన తోకతో ఆకాశంలో ఉన్న నక్షత్రాల్లో మూడవ భాగాన్ని ఈడ్చి వాటిని భూమి మీదికి విసిరికొట్టాడు. ఆ మహాసర్పం కనడానికి నొప్పులు పడుతున్న స్త్రీకి ఎదురుగా నిలబడ్డాడు. ఆ స్త్రీ బిడ్డకు జన్మ నివ్వగానే ఆ బిడ్డను మింగివేయాలన్నది వాడి ఉద్దేశం. 1 మగ బిడ్డ-క్రీస్తు

Revelation 12:17అందుచేత తీవ్రమైన ఆగ్రహం తెచ్చుకున్న ఆ మహా సర్పం, దేవుని ఆదేశాలు పాటిస్తూ యేసును గురించి ప్రకటిస్తూ ఉన్న ఆమె సంతానంలో మిగిలిన వారితో యుద్ధం చేయడానికి బయల్దేరాడు.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)聖書 (日本語)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)

Study ప్రకటన గ్రంథము 12:3

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeAlbert BarnesJohn WesleyJohn CalvinScofieldWilliam BurkittFamily Bible NotesGeneva Bible Notes (1599)
← ప్రకటన గ్రంథము 12:2ప్రకటన గ్రంథము 12ప్రకటన గ్రంథము 12:4 →