ప్రకటన గ్రంథము 12:4
వాడు తన తోకతో ఆకాశంలో ఉన్న నక్షత్రాల్లో మూడవ భాగాన్ని ఈడ్చి వాటిని భూమి మీదికి విసిరికొట్టాడు. ఆ మహాసర్పం కనడానికి నొప్పులు పడుతున్న స్త్రీకి ఎదురుగా నిలబడ్డాడు. ఆ స్త్రీ బిడ్డకు జన్మ నివ్వగానే ఆ బిడ్డను మింగివేయాలన్నది వాడి ఉద్దేశం. 1 మగ బిడ్డ-క్రీస్తు
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Daniel 8:9ఈ కొమ్ముల్లో ఒక దానిలో నుండి ఒక చిన్నకొమ్ము మొలిచింది. అది దక్షిణానికి, తూర్పుకు, ఇశ్రాయేలు మహిమాన్విత దేశం వైపుకు అత్యధికంగా ప్రబలింది.
John 8:44మీరు మీ తండ్రి అయిన సాతానుకు సంబంధించిన వారు. మీ తండ్రి దురాశలను నెరవేర్చాలని మీరు చూస్తున్నారు. మొదట్నించీ వాడు హంతకుడు, వాడు సత్యంలో నిలిచి ఉండడు. ఎందుకంటే వాడిలో సత్యం లేదు. వాడు అబద్ధం చెప్పినప్పుడల్లా తన స్వభావాన్ని అనుసరించి మాట్లాడతాడు. వాడు అబద్ధికుడు, అబద్ధానికి తండ్రి.
Revelation 8:7మొదటి దూత బాకా ఊదినప్పుడు రక్తంతో కలసిన వడగళ్ళూ నిప్పూ భూమి మీద కురిశాయి. దాని మూలంగా భూమి మీద మూడవ భాగం, చెట్లలో మూడవ భాగం తగలబడి పోయాయి. పచ్చగడ్డి అంతా తగలబడిపోయింది. 1 రెండవ బాకా
Revelation 9:19ఆ గుర్రాల బలం వాటి నోళ్ళలోనూ తోకల్లోనూ ఉంది. ఎందుకంటే ఆ తోకలు తలలున్న పాముల్లా ఉన్నాయి. అవి వాటితో మనుషులను గాయపరుస్తాయి.
Revelation 12:9ఈ మహా సర్పానికి అపవాది అనీ, సాతాను అనీ పేర్లున్నాయి. వాడు లోకాన్నంతా మోసం చేసే ప్రాచీన సర్పం. వాణ్ణీ వాడితో పాటు వాడి అనుచర దూతలనూ భూమి మీదికి తోసి వేశారు.