ప్రకటన గ్రంథము 8:12
నాలుగవ దూత బాకా ఊదినప్పుడు సూర్యుడిలో మూడవ భాగం, చంద్రుడిలో మూడోభాగం, నక్షత్రాల్లో మూడవభాగం దెబ్బ తిన్నాయి. కాబట్టి వాటిలో మూడోభాగం కాంతి విహీనం అయ్యాయి, చీకటిగా మారాయి. దాంతో పగలు మూడవ భాగం, రాత్రి మూడవ భాగం వెలుగు లేకుండా పోయింది.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Exodus 10:21అప్పుడు యెహోవా మోషేతో “ఆకాశం వైపు నీ చెయ్యి చాపు. ఐగుప్తు దేశమంతా కటిక చీకటి కమ్ముకుంటుంది” అని చెప్పాడు. 1 తొమ్మిదవ తెగులు. చీకటి
Isaiah 24:23చంద్రుడు వెలవెలబోతాడు. సూర్య బింబం మారిపోతుంది. సేనల ప్రభువైన యెహోవా సీయోను కొండ మీదా యెరూషలేములో రాజవుతాడు. పెద్దల ఎదుట ఆయన ప్రభావం కనబడుతుంది.
Ezekiel 32:7నేను నీ దీపాన్ని ఆర్పివేసినప్పుడు ఆకాశాన్ని మూసేసి, నక్షత్రాలను చీకటి చేస్తాను. 2 సూర్యుణ్ణి మబ్బుతో కమ్ముతాను. చంద్రుడు వెన్నెల ఇవ్వడు. 2
Joel 2:31యెహోవా భయంకరమైన ఆ మహాదినం రాకముందు 1 సూర్యుడు చీకటిగా, చంద్రుడు రక్తంలా మారతాయి. 1
Amos 8:9యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, 2 ఆ రోజు నేను మధ్యాహ్నమే పొద్దు గుంకేలా చేస్తాను. 2 పట్టపగలే భూమికి చీకటి కమ్ముతుంది. 2
Matthew 24:29“ఆ బాధలన్నీ అయిపోగానే సూర్యుణ్ణి చీకటి కమ్ముతుంది. చంద్రుడు కాంతిని కోల్పోతాడు. ఆకాశం నుండి నక్షత్రాలు రాలిపోతాయి. ఆకాశంలోని శక్తులు చెల్లాచెదరౌతాయి.