Ruth 4:12
ఎఫ్రాతాలో నీకు క్షేమం, అభివృద్ధీ కలిగి బేత్లెహేములో పేరు ప్రఖ్యాతులు పొందుతావు గాక! యెహోవా ఈ యువతి వల్ల నీకు అనుగ్రహించే సంతానం, నీ కుటుంబం తామారు యూదాకు కనిన పెరెసు + 4:12 పెరెసు ఎఫ్రాతా గోత్రం కుటుంబంలా ఉండుగాక!” అన్నారు. 1 ఓబేదు పుట్టుక, దావీదు వంశక్రమం 1దిన 2:5-15; మత్తయి 1:3-6; లూకా 3:31-33
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Genesis 38:29వాడు తన చెయ్యి వెనక్కి తీయగానే అతని సోదరుడు బయటికి వచ్చాడు. అప్పుడామె “నువ్వెందుకురా చొచ్చుకు వచ్చావు?” అంది. అందుచేత వాడికి “ + 38:29 ఛేదించుకుని. బద్దలు చేసుకుని.పెరెసు” అని పేరు పెట్టారు.
Numbers 26:20యూదావారి వంశాల్లో షేలాహీయులు షేలా వంశస్థులు, పెరెసీయులు పెరెసు వంశస్థులు, జెరహీయులు జెరహు వంశస్థులు,
1 Samuel 2:20“యెహోవా సన్నిధిలో వేడుకొన్నప్పుడు నీకు కలిగిన ఈ సంతానానికి బదులుగా యెహోవా నీకు మరెక్కువ సంతానం ఇస్తాడు” అని ఏలీ ఎల్కానాను, అతని భార్యను దీవించిన తరువాత వారు ఇంటికి వెళ్ళారు.
Matthew 1:3యూదాకు తామారు ద్వారా పుట్టిన కొడుకులు పెరెసు, జెరహు. పెరెసు కొడుకు ఎస్రోము. ఎస్రోము కొడుకు ఆరాము.