Zechariah 10:2
గృహ దేవతలు వ్యర్థమైన మాటలు పలికాయి. సోదె చెప్పేవాళ్ళకు వ్యర్ధమైన కలలు వచ్చాయి. వాళ్ళు కపటంతో ఆ కలలకు అర్థం చెప్పారు. మోసపూరిత భావాలు చెప్పి ఓదార్చారు. కాబట్టి ప్రజలు గొర్రెల మంద తిరిగినట్టు తిరిగారు. తమను కాచే కాపరి లేకపోవడం వల్ల బాధల పాలయ్యారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Genesis 31:19లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించడానికి వెళ్ళిన సమయంలో రాహేలు తన తండ్రి ఇంట్లో ఉన్న గృహ దేవుళ్ళను దొంగిలించింది.
Deuteronomy 13:2మీరు ఎరుగని “ఇతర దేవుళ్ళను అనుసరించి పూజిద్దాం రండి” అని చెబుతాడేమో.
1 Kings 22:17మీకాయా “ఇశ్రాయేలీయులంతా కాపరిలేని గొర్రెల్లాగా కొండల మీద చెదరి పోవడం నేను చూశాను. వారికి కాపరి లేడు. అందరూ ఎవరింటికి వాళ్ళు ప్రశాంతంగా వెళ్లిపోవచ్చు అని యెహోవా చెబుతున్నాడు” అన్నాడు.
Job 21:34మీరు చెప్పే జవాబులు నమ్మదగినవిగా లేవు. ఇలాంటి వ్యర్ధమైన మాటలతో మీరు నన్నెలా ఓదార్చాలని చూస్తున్నారు?
Isaiah 44:9విగ్రహాన్ని చేసే వారంతా మిధ్య. వారిష్టపడే విగ్రహాలు వ్యర్ధం. వారి సాక్షులు గ్రహింపు లేనివారు. చూడలేరు. కాబట్టి వారు సిగ్గు పాలవుతారు. 1
Isaiah 46:5నన్ను ఎవరితో పోల్చి ఎవరిని నాకు సాటివారుగా చేస్తారు? నాకు సమానమని ఎవరిని నాకు పోటీగా చేస్తారు? 1