జెకర్యా 11:16
ఎందుకంటే నేను దేశంలో ఒక కాపరిని నియమించబోతున్నాను. అతడు నశించిపోయే గొర్రెలను లక్ష్యపెట్టడు. చెదరిపోయిన వాటిని వెదకడు. గాయపడిన వాటిని బాగుచేయడు. ఆరోగ్యంగా ఉన్నవాటిని పోషించడు. అయితే కొవ్విన వాటి డెక్కలు చీల్చి వాటి మాంసం తింటూ ఉంటాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Genesis 33:13అతడు “నాదగ్గర ఉన్న పిల్లలు పసిపిల్లలనీ, గొర్రెలు, మేకలు, పశువులు పాలిచ్చేవి అని నా ప్రభువుకు తెలుసు. ఒక్క రోజే వాటిని వేగంగా తోలితే ఈ మంద అంతా చస్తుంది.
Isaiah 40:11ఒక గొర్రెల కాపరిలాగా ఆయన తన మందను మేపుతాడు. తన చేతులతో గొర్రెపిల్లలను ఎత్తి రొమ్మున ఆనించుకుని మోస్తాడు. 1 పాలిచ్చే గొర్రెలను ఆయన నెమ్మదిగా నడిపిస్తాడు. 1
Jeremiah 23:22ఒకవేళ వాళ్ళు నా సలహా మండలిలో నిలబడి ఉంటే, వాళ్ళు నా మాటలు నా ప్రజలకు తెలియజేసే వాళ్ళే. వాళ్ళ చెడ్డ మాటల నుంచి, వాళ్ళ దుర్మార్గపు అలవాట్ల నుంచి వాళ్ళను తప్పించి ఉండే వాళ్ళే.” 1
Ezekiel 34:10“యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే, నా జీవం తోడు. నేను ఆ కాపరులకు విరోధినయ్యాను. నా గొర్రెలను గురించి వారి దగ్గర లెక్క అడుగుతాను. వారిక గొర్రెలు మేపడం మాన్పిస్తాను. కాపరులు తమ కడుపు నింపుకోకుండేలా చేస్తాను. నా గొర్రెలు వారికి తిండి కాకుండా వారి నోట్లో నుంచి వాటిని తప్పిస్తాను.” ఇదే యెహోవా ప్రభువు సందేశం. 1 ప్రభువువైన దేవుడు గొర్రెల కాపరి
Ezekiel 34:21మీరు భుజాలతో పక్కతో తోస్తూ ఉంటే, నీరసించిపోయిన వాటన్నిటినీ కొమ్ములతో పొడుస్తూ చెదరగొట్టేస్తున్నారు.
Matthew 23:2“ధర్మశాస్త్ర పండితులు, పరిసయ్యులు మోషే పీఠంపై కూర్చుంటారు.