Zechariah 5:9
నేను మళ్ళీ చూసినప్పుడు ఇద్దరు స్త్రీలు బయలుదేరారు. సంకుబుడి కొంగ రెక్కలవంటి రెక్కలు వాళ్లకు ఉన్నాయి. గాలికి వాళ్ళ రెక్కలు ఆడుతున్నాయి. వాళ్ళు వచ్చి గంపను మోసుకుంటూ భూమి ఆకాశాల మధ్యకు దాన్ని ఎత్తారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
8అప్పుడతడు “ఇది దోషంతో నిండి ఉంది” అని నాతో చెప్పి గంపలో ఆ స్త్రీని పడవేసి సీసపు మూతను గంపపై ఉంచాడు.
10నేను నాతో మాట్లాడుతున్న దూతతో “వీళ్ళు ఈ గంపను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు?” అని అడిగాను.
Cross References
Leviticus 11:19కొక్కిరాయి, అన్ని రకాల కొంగలు, కుకుడు గువ్వ, గబ్బిలం.
Daniel 9:26ఈ 62 వారాలు జరిగిన తరువాత అభిషిక్తుడు పూర్తిగా నిర్మూలం అయి పోతాడు. వస్తున్న రాజు ప్రజలు పవిత్ర పట్టణాన్ని పరిశుద్ధ ఆలయాన్ని ధ్వంసం చేస్తారు. వాడి అంతం హఠాత్తుగా వస్తుంది. యుద్ధ కాలం సమాప్తమయ్యే వరకూ నాశనం జరుగుతుందని నిర్ణయం అయింది.
Matthew 24:28శవం ఎక్కడ ఉంటే అక్కడ రాబందులు పోగవుతాయి.