జెఫన్యా 2:9
నా జీవం తోడు మోయాబు దేశం సొదొమ పట్టణం వలె, అమ్మోను దేశం గొమొర్రా పట్టణం వలె అవుతాయి + 2:9 ఆది. 19:23-29 చూడండి. అవి ముళ్ళ చెట్లకు ఉప్పు గోతులకు స్థావరమై ఎప్పుడూ పాడుబడిపోయి ఉంటాయి. నా ప్రజల్లో శేషించినవారు ఆ దేశాలను దోచుకుంటారు. నా ప్రజల్లో శేషించినవారు వాటిని స్వతంత్రించుకుంటారు. కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడైన సేనలప్రభువు యెహోవా వాక్కు ఇదే.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Genesis 19:25ఆయన ఆ పట్టణాలనూ, ఆ మైదానమంతటినీ, ఆ పట్టణాల్లో నివసించేవారందరినీ, నేలపై మొక్కలనూ నాశనం చేశాడు.
Deuteronomy 29:22కాబట్టి రాబోయే తరం వారు, మీ తరువాత పుట్టే మీ సంతానం, చాలా దూరం నుంచి వచ్చే పరాయి దేశీయులు మీ దేశానికి యెహోవా రప్పించిన తెగుళ్లనూ రోగాలనూ చూస్తారు.
Isaiah 11:14వాళ్ళు పడమటివైపు ఉన్న ఫిలిష్తీయుల కొండల మీదకి దూసుకొస్తారు. వాళ్ళు ఏకమై తూర్పు వారిని కొల్లగొడతారు. వాళ్ళు ఎదోము మీద, మోయాబు మీద దాడి చేస్తారు, అమ్మోనీయులు వాళ్లకు విధేయులౌతారు. 1
Isaiah 15:1మోయాబు గురించి ప్రకటన. 1 ఒకే రాత్రిలో ఆర్ మోయాబు పాడై నాశనమౌతుంది. 1 ఒక్క రాత్రిలో కీర్ మోయాబు పాడై నాశనమౌతుంది. 1
Isaiah 34:9ఎదోము కాలువలు కీలులాగా, దాని మట్టి గంధకంగా మారిపోతుంది. 1 దాని భూమి మండుతున్న గంధకంగా ఉంటుంది. 1
Jeremiah 46:18సేనల ప్రభువూ, రాజూ అయిన యెహోవా ఇలా ప్రకటన చేస్తున్నాడు. “నా తోడు, ఒక మనిషి రాబోతూ ఉన్నాడు. అతడు తాబోరు పర్వతం లాంటి వాడు. సముద్రం పక్కనే ఉన్న కర్మెలు లాంటి వాడు. 1